తల్లడిల్లిన విజయ్.. కేరళ బాధితుల కోసం 14 కోట్ల విరాళం

By Rajababu

ప్రకృతి రమణీయమైన దృశ్యాలకు వేదికైన కేరళ రాష్ట్రం భారీ వర్షాలకు అతలాకుతలమైంది. కేరళవాసుల జనజీవనం స్థంభించింది. ప్రకృతి విలయతాండవానికి దాదాపు 385 మందికి పైగా మరణించారు. . ఇలాంటి దారుణమైన పరిస్థితుల్లో అక్కడి ప్రజలకు అండగా ఉండేందుకు దక్షిణాది చిత్ర పరిశ్రమలు ముందుకొస్తున్నాయి. వ్యక్తిగతంగా సినీ స్టార్లు, నటులు తమ వంతు సహాయాన్ని అందిస్తున్నారు.

పది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కేరళ జలదిగ్భంధం కావడంతో ఇళయ దళపతి విజయ్ తల్లడిల్లిపోయారు. తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు లేక నిరాశ్రయులైన వారిని చూసి ఆయన చలించారు. బాధితుల సహాయం కోసం విజయ్ రూ.14 కోట్ల భారీ విరాళాన్ని అందించారు. విజయ్ సహాయంపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

Thalapathy Vijay donates Rs.14 crores

కాగా, కేరళవాసులను ఆదుకోవడానికి సిద్ధార్థ్ ముందుకొచ్చాడు. తనవంతుగా సహాయం చేస్తూనే డొనేషన్ ఛాలెంజ్‌ను ప్రారంభించారు. విలక్షణ నటుడు కమల్ హాసన్ రూ.25 లక్షల విరాళం ప్రకటించారు. తోటి నటులు స్పందించాలని ఆయన కోరారు. ఇలా పలువురు హీరోలు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X