అజిత్ ఫ్యాన్స్‌కు షాకిచ్చిన విజయ్.. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయి నుంచి..
తమిళనాడులో అజిత్ ఫ్యాన్స్‌కు, విజయ్ అభిమానులకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉన్నాయి. విజయ్‌కి శ్రద్దాంజలి అంటూ అజిత్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పిండాలు.. అదే రేంజ్‌లో అజిత్‌కు విజయ్ ఫ్యాన్స్ తద్దినాలు పెట్టిన వైనం వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. అయితే ఈ వైరుధ్యాలు అభిమానుల మధ్యే గానీ.. మా మధ్య లేవని విజయ్ మరోసారి నిరూపించారు. తాజాగా మాస్టర్ ఆడియో రిలీజ్ వేదిక దీనికి సాక్ష్యంగా నిలిచింది. వివరాల్లోకి వెళితే..

స్టేజ్‌పై స్టెప్పులేసిన విజయ్
ఆదివారం రాత్రి చెన్నైలో విజయ్ నటించిన మాస్టర్ సినిమా ఆడియో రిలీజ్ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి విజయ్ సేతుపతి, మాళవిక నాయర్, అనిరుధ్ రవిచందర్, ఇతర చిత్ర యూనిట్ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా విజయ్ జోష్‌తో కనిపించారు. స్టేజ్ ఎక్కి అనిరుధ్, శంతను భాగ్యరాజ్‌తో కలిసి స్టెప్పులు వేశాడు.

బాధగా ఉందంటూ
ఇక విజయ్ చాలా ఎమోషనల్‌గా ప్రసంగాన్ని ప్రారంభించి.. నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉన్న అభిమానులందరికీ నమస్కారాలు. ఆడియో రిలీజ్ ఫంక్షన్‌కు నా అభిమానులందరినీ పిలువలేకపోయినందుకు చాలా బాధగా ఉంది. కరోనావైరస్ కారణంగా ఈ వేడుకను ప్రైవేట్ కార్యక్రమంగా నిర్వహించాం అని విజయ్ చెప్పారు.

అజిత్ మాదిరిగానే డ్రస్
మాస్టర్ ఆడియో వేడుక నాకు చాలా ప్రత్యేకమైనది. అందుకే నాకు అత్యంత స్నేహితుడు అజిత్ మాదిరిగా నేను డ్స్ వేసుకొని వచ్చాను. అజిత్‌కు బ్లేజర్‌లో కనిపించడం ఇష్టం. అందుకే నేను కూడా బ్లేజర్ వేసుకొని వచ్చాను అని ఫ్యాన్స్‌లో మనస్పర్దలు తొలగించేందుకు ప్రయత్నించారు. విజయ్ చేసిన ప్రయత్నంపై సోషల్ మీడియాలో ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
Recommended Video

ఐటీ దాడులు లేని ప్రశాంత జీవితాన్ని
గతనెల తనపై జరిగిన ఐటీ దాడులపై విజయ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గతంలో మాదిరిగా ఐటీదాడులు లేని ప్రశాంత జీవితాన్ని గడపాలనుకొంటున్నాను అని యాంకర్ అడిగిన ఓ ప్రశ్నకు విజయ్ చిలిపిగా సమాధానం ఇచ్చారు. మహానగరం ఫేం లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన మాస్టర్ చిత్రం ఏప్రిల్‌లో రిలీజ్‌కు సిద్ధమవుతున్నది. ఈ చిత్రానికి అనిరుధ్ దర్శకత్వం వహిస్తున్నారు.


Click it and Unblock the Notifications











