ఐరన్ లెగ్‌ని తీసేండయ్యా .. హీరోయిన్‌పై ఆ స్టార్ హీరో ఫ్యాన్స్ దారుణంగా
అన్ని ఇండస్ట్రీలలో మాదిరిగానే చిత్ర పరిశ్రమలో ఎన్నో సెంటిమెంట్స్ ఉంటాయి. హిట్ వెంట పరుగులు తీసే ఇండస్ట్రీలో నాటి నుంచి నేటి వరకు ఎన్నో నమ్మకాలు ఉన్నాయి. అక్షరాలు, సంఖ్యలు, రిలీజ్ డేట్స్, హీరోయిన్లు ఇలా అన్ని అంశాల్లో సెంటిమెంట్స్ ఫాలో అయ్యేవారు ఎందరో. ఎవరేం చేసినా అందరి లక్ష్యం హిట్ కొట్టడమే ఇక్కడ ఇంపార్టెంట్. కానీ దురదృష్టవశాత్తూ కొందరు హీరోలు, హీరోయిన్లు ఐరెన్‌లెగ్‌గా ముద్ర వేయించుకుంటున్నారు. తాజాగా ఓ హీరోయిన్ విషయంలో దారుణంగా ట్రోలింగ్ జరుగుతోంది.
మూడు గంటల సినిమా కోసం అందరూ శక్తి వంచన లేకుండా కష్టపడతారు. నూటికి నూరు శాతం ఎఫర్ట్ పెట్టినా ఎందుకో కొందరికి మాత్రం అనుకున్న స్థాయిలో గుర్తింపు రాదు. ఏదైనా సినిమా ఏ కారణం చేతైనా ఫ్లాప్ అయితే దానికి కొందరినే బలి చేయడం దారుణం. సెంటిమెంట్ ముసుగులో వారు బలైపోతుంటారు. ఈ కోవలోకే వస్తారు పూజా హెగ్డే. మోడలింగ్‌లో అనుకున్నది సాధించడానికి ఎంతో కష్టపడిన ఈ ముద్దుగుమ్మ.. సినిమాల్లో నెగ్గుకు రావడానికి కూడా అంతే శ్రమించారు.

కెరీర్ బిగినింగ్‌లోనే ఐరన్ లెగ్ ట్యాగ్
స్టార్ స్టేటస్ తనకి ఈజీగా రాలేదని ఎన్నో అవమానాలు, ఛీత్కారాలు అనుభవించానని మనస్తాపానికి గురికాకుండా మనో ధైర్యంతోనే అడుగు వేశానని పూజా చెప్పారు . సినిమా రంగంలో నెంబర్ గేమ్ శాశ్వతం కాదని.. కానీ దురదృష్టవశాత్తూ కెరీర్ బిగినింగ్‌లోనే ఐరన్ లెగ్ ముద్ర వేశారని ఆమె పలుమార్లు వాపోయారు. ఇదంతా ప్రేక్షకుల చేతిల్లోనే ఉంటుందన్న పూజా హెగ్డే.. వారికి నచ్చితే కొత్తవారిని అందలం ఎక్కిస్తారని, అదే తేడా వస్తే ఎలాంటి వారినైనా ఇంటికి పంపిస్తారని చెప్పింది.
రెట్రోకి మిక్స్‌డ్ టాక్
తొలినాళ్లలో తనపై పడిన ఐరన్ లెగ్ ముద్రను కష్టపడి అధిగమించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం మరోసారి కష్టాలు ఎదుర్కొంటోంది. లాంగ్ గ్యాప్ తర్వాత తమిళ్‌లో ఆమె నటించిన రెట్రో కార్మికుల దినోత్సవం సందర్భంగా మే 1న ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే మార్నింగ్ షో నుంచే ఈ చిత్రం డివైడ్ టాక్ తెచ్చుకోవడంతో సూర్య అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా రిజల్ట్‌కు పూజా హెగ్డేయే కారణమంటూ వారు ట్రోల్ చేస్తున్నారు. ఈ దశలో వారికి ఇళయ దళపతి విజయ్ అభిమానులు జత కలిశారు.
జన నాయగన్‌పై విజయ్ అభిమానుల ఆశలు
30 ఏళ్ల సినీ జీవితానికి తెరదించుతూ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు విజయ్. టీవీకే పేరుతో పార్టీని స్థాపించి ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. తన నట జీవితానికి ఫుల్ స్టాప్ పెడుతున్నానని.. జన నాయగన్ తన చివరి చిత్రమని విజయ్ అధికారికంగా ప్రకటించారు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇందులో హీరోయిన్‌గా పూజా హెగ్డే నటిస్తున్నారు. ఈ సినిమా త్వరగా కంప్లీట్ చేసి ఎన్నికల రణరంగంలో దిగాలని విజయ్ భావిస్తుంటంతో షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఇప్పుడు రెట్రో రిజల్ట్ నేపథ్యంలో జన నాయగన్ ఫలితంపై విజయ్ అభిమానులు టెన్షన్ పడుతున్నారు. కొందరు ఫ్యాన్స్ అయితే పూజా హెగ్డేను తీసేయమంటూ ట్రోల్ చేస్తున్నారు. మరి దీనిపై జన నాయగన్ చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











