twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Thalapathy Vijay కలకలం.. తల్లిదండ్రులు సహా 11 మంది మీద కేసు.. అవే కొంప ముంచాయా?

    |

    తమిళ్ స్టార్ హీరోగా ఎదిగిన విజయ్ రాజకీయ అరంగేట్రం చేయాలని, ఆయన అభిమానులు ఎప్పటి నుండో కోరుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే స్టార్ హీరోగా కెరీర్ పీక్స్ లో ఉండగా విజయ్ అనే కాదు మరే హీరో కూడా రిస్క్ చేయాలని అనుకోడు, అందుకే ఇలాంటి నిర్ణయం సరికాదని విజయ్ ఈ విషయంపై నోరుమెదపడం లేదు. ఐతే విజయ్ తండ్రి చంద్రశేఖర్ రాజకీయం చేయాలనీ చూడగా కొన్నాళ్ల క్రితం తండ్రీ కొడుకుల మధ్య వివాదం ముదిరి మీడియా దాకా ఎక్కింది. ఇప్పుడు మరో సరి విజయ్ తన తండ్రి సహా మొత్తం పదకొండు మంది మీద కేసు పెట్టినట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే

    Natraj Master భార్య నీతూ సీమంతం ఫోటోలు.. బుల్లితెర తారలే దిగివచ్చి!Natraj Master భార్య నీతూ సీమంతం ఫోటోలు.. బుల్లితెర తారలే దిగివచ్చి!

    రాజకీయం

    రాజకీయం

    గత ఏడాది నవంబర్ నెలలో విజయ్‌ అభిమాన సంఘాల సమాఖ్యగా ఉన్న విజయ్‌ మక్కల్‌ ఇయక్కంను రాజకీయ పార్టీగా కేంద్ర ఎన్నికల సంఘంలో రిజిస్టర్‌ చేసినట్లు విజయ్ తండ్రి ప్రకటించారు. ఆ ప్రకటన జారీ చేసిన కొద్ది సేపటికే విజయ్‌ ఓ ప్రకటన విడుదల చేస్తూ తండ్రి ఎస్‌ఏ చంద్రశేఖర్‌ ప్రారంభించిన పార్టీకి తనకు ఎలాంటి సంబంధం లేదని, తన అభిమానులు ఎవరూ ఆ పార్టీలో చేరవద్దని కోరారు. అంతేకాకుండా విజయ్‌ మక్కల్‌ ఇయక్కం పేరును గానీ, ఆ ఇయక్కం పతాకాన్ని, తన ఫొటోను వాడితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఒక ప్రకటనలో హెచ్చరించారు.

    అసలు ఏమైందంటే?

    అసలు ఏమైందంటే?

    ఈ క్రమంలో తండ్రి కొడుకుల మధ్య పొసగడం లేదని పెద్ద ఎత్తున రచ్చ మొదలైంది. దీంతో చంద్రశేఖర్‌ మీడియా సమావేశం ఏర్పాటు చేసి విజయ్‌కు తనకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని, విజయ్‌ మక్కల్‌ ఇయక్కంను రాజకీయ పార్టీగా మార్చాలన్నది తాను తీసుకున్న నిర్ణయమని చెప్పారు. ఆ తర్వాత ఓ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్ తండ్రి చంద్రశేఖర్ 'విజయ్ విష వలయంలో చిక్కుకుని కొట్టుమిట్టాడుతున్నారు' అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రశేఖర్‌ మాట్లాడుతూ విజయ్‌ చుట్టూ దుష్టశక్తులు చేరాయని కూడా అన్నారు.

    జైలు వెళ్లేందుకు సిద్ధం

    జైలు వెళ్లేందుకు సిద్ధం

    తన ఫొటోను, ఇయక్కం పతాకాన్ని ఉపయోగిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటానని విజయ్‌ హెచ్చరించడం గురించి కూడా మాట్లాడుతూ విజయ్ తనపై చర్యలు తీసుకుని జైలుకు పంపినా బాధపడనని అయితే విజయ్‌కి అభిమాన సంఘాన్ని మొట్టమొదట ఏర్పాటు చేసింది తానేనని, ఆ తర్వాత మక్కల్‌ ఇయక్కంగా మార్చి వ్యవస్థాపకుడిగా ఉన్నానని కూడా గుర్తు చేశారు, వ్యవస్థాపకుడినయిన తాను విజయ్‌ మక్కల్‌ ఇయక్కంను రాజకీయ పార్టీగా మార్చటం తప్పుకాదని కూడా అన్నారు.

    సైలెంట్ అయింది కానీ

    సైలెంట్ అయింది కానీ

    అయితే ఆ తర్వాత సైలెంట్ అయినా ఈ వ్యవహారం ఇప్పుడు మళ్ళీ తెర మీదకు వచ్చింది. నటుడు విజయ్ తన పేరుతో ఎలాంటి సమావేశం మరియు కార్యకలాపాలు నిర్వహించకుండా తన తల్లిదండ్రులతో సహా 11 మందిని నిరోధించాలని కోరుతూ సిటీ కోర్టులో సివిల్ పిటిషన్ వేశారు. సివిల్ పిటిషన్ లో, అతను అసోసియేషన్ యొక్క దస్తావేజు చెల్లదని ప్రకటించాలని కోరాడు మరియు అతని పేరును ఉపయోగించి ఏదైనా సమావేశం మరియు కార్యకలాపాలను నిర్వహించడం పై కూడా స్టే ఇవ్వాలని కోరారు.

    తల్లిదండ్రులతో సహా 11

    తల్లిదండ్రులతో సహా 11

    తన తల్లిదండ్రులతో సహా 11 మంది ప్రతివాదులపై మధ్యంతర స్టే విధించాలని కోరాడు. అతని అభిమాన సంఘం కార్యాలయ సిబ్బందిని కూడా ప్రతివాదులుగా పేర్కొన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. తమిళనాడులోని 9 జిల్లాలకు స్థానిక ఎన్నికలు అక్టోబర్‌లో జరగాల్సి ఉంది. ఈ పరిస్థితిలో, నటుడు విజయ్ తన తండ్రి SA చంద్రశేఖర్, తల్లి శోబా మరియు విజయ్ పీపుల్స్ మూవ్మెంట్ ఎగ్జిక్యూటివ్‌లను తన పేరు ఉపయోగించి సమావేశాలు నిర్వహించకుండా నిషేధించాలని కోరుతూ కోర్టులో కేసు వేశారు. ఈ కేసు విచారణ 27న విచారణకు రానుంది.

    అప్పుడే పార్టీ

    అప్పుడే పార్టీ

    చాలా నెలల క్రితం విజయ్ తండ్రి ప్రముఖ దర్శకుడు SA చంద్రశేఖర్ ఆల్ ఇండియా తలపతి విజయ్ మక్కల్ ఐయక్కం అనే రాజకీయ పార్టీని ప్రారంభించారు. ప్రధాన కార్యదర్శిగా SA చంద్రశేఖర్(విజయ్ తండ్రి), కోశాధికారిగా శోభా చంద్రశేఖర్(విజయ్ తల్లి) మరియు నాయకుడిగా పద్మనాభన్ పేర్లు భారత ఎన్నికల సంఘానికి దాఖలు చేయబడ్డాయి.

    అక్టోబర్ 6 మరియు 7 తేదీలలో తమిళనాడులో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగనున్నాయి. దీనికి నామినేషన్ ప్రస్తుతం జరుగుతోంది. అలాగే, నామినేషన్లకు చివరి తేదీ సెప్టెంబర్ 22. ప్రధాన పార్టీలకు ధీటుగా ఈసారి ఎన్నికల్లో స్వతంత్రులు కూడా పోటీ చేయాలని భావిస్తున్నారు. ఈ పరిస్థితిలో, నటుడు విజయ్ పేరిట మొదలైన పార్టీ కూడా పోటీ చేస్తుండడంతో ఈ వివాదం మళ్ళీ తెర మీదకు వచ్చింది.

    Recommended Video

    Vijay Anthony's Vijaya Raghavan Team Interview Part 2
    తెలుగులో స్ట్రెయిట్ సినిమా

    తెలుగులో స్ట్రెయిట్ సినిమా

    హీరో విజయ్‌కు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్‌ ఉంది. గత నాలుగేళ్లుగా విజయ్‌ నటించిన చిత్రాలు అటు తమిళంతో పాటు ఇటు తెలుగులోనూ ఒకేసారి విడుదల అవుతున్నాయి. అలా సర్కార్, అదిరింది, విజిల్, మాస్టర్‌ వంటి చిత్రాలు విజయ్‌కి ఇక్కడ అభిమానులను సంపాదించిపెట్టాయి. ఈ చిత్రాలకు లభించిన ఆదరణను చూసి, తెలుగులో ఓ స్ట్రయిట్‌ ఫిల్మ్‌ చేయాలని అనుకున్నారని, వంశీ పైడిపల్లి డైరెక్షన్లో ఒక సినిమా చేస్తారని ప్రచారం జరిగినా అది ఇంకా పట్టాలు ఎక్కలేదు.

    English summary
    Thalapathy Vijay filed a case against 11 people, including his mother and father, came for a hearing in Madras High Court causing a huge sensation in Kollywood.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X