twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తలపతి విజయ్ దూకుడు.. మాస్టర్ రిలీజ్ తర్వాత మూడు చిత్రాలకు గ్రీన్ సిగ్నల్

    |

    తమిళ సూపర్‌స్టార్ విజయ్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం ఆయన నటించిన మాస్టర్ చిత్రం రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. వాస్తవానికి ఈ చిత్రం ఏప్రిల్‌లోనే రిలీజ్ కావాల్సి ఉంది. దర్శకుడు లోకేష్ కనకరాజ్ రూపొందించిన ఈ చిత్రం లాక్‌డౌన్ కారణంగా విడుదల ఆగిపోయింది. అయితే మాస్టర్ రిలీజ్ కాకుండానే మరో మూడు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

    తన కెరీర్‌లో 65వ చిత్రంగా రూపొందే సినిమాను సన్ పిక్చర్స్ నిర్మించనున్నది. ఈ చిత్రానికి ఏఆర్ మురగదాస్ దర్శకత్వం వహిస్తారని.. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్తుందని కోలీవుడ్ మీడియా కోడైకూస్తున్నది.

    Thalapathy Vijay given green Signal to Three movies after Master

    అదే ఊపులో తన కెరీర్‌లో 66వ చిత్రానికి కూడా విజయ్ సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఈ చిత్రాన్ని మెర్సల్ రూపొందించిన శ్రీ తెనాండల్ స్టూడియోస్ నిర్మించనున్నది. ఈ చిత్రానికి పాండిరాజ్ దర్శకత్వం వహిస్తారనే వార్త చక్కర్లు కొడుతున్నది. ఈ చిత్రం పక్కా ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతున్నట్టు సమాచారం.

    ఇక ఈ రెండు సినిమాల తర్వాత మరో సినిమాకు కూడా పచ్చజెండా ఊఫినట్టు తెలుస్తున్నది. ఎక్స్ బీ ఫిల్మ్ క్రియేటర్స్, సెవెన్ స్క్రీన్ స్టూడియస్ సంయుక్తంగా నిర్మించే సినిమాలో నటించడానికి సంసిద్ధతను వ్యక్తం చేసినట్టు సమాచారం. ఇంకా ఇప్పటికే సుధా కొంగర, శశికుమార్, తిరుమెని, అరుణ్ రాజా కామరాజ్, మోహన్ రాజా చెప్పిన కథలపై ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం.

    ఇక మాస్టర్ చిత్రంలో విజయ్‌తో పాటు విజయ్ సేతుపతి నటిస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి విలన్ పాత్రను పోషిస్తున్నారు. అయితే త్వరలో విడుదల చేయబోయే రెండో పోస్టర్‌ విజయ్ సేతుపతి ఫోటోతో విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్టు సమాచారం. విజయ్ సేతుపతి క్యారెక్టర్‌ను దర్శకుడు లోకేష్ కనకరాజ్ విభిన్నంగా తీర్చిదిద్దినట్టు తెలుస్తున్నది.

    English summary
    Thalapathy Vijay given nod for Three movies after Master. Master will be coming on Diwali. Infact this movie has to release in April. but its postponed due to lockdown.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X