Don't Miss!
- News కేసీఆర్‌కు ఎన్నికల సంఘం నోటీసులు
- Sports KKR vs RR: ఈ ఓటమి బాధ వర్ణాతీతం.. మాటలు రావడం లేదు: శ్రేయస్ అయ్యర్
- Lifestyle 30 ఏళ్లు దాటిన తర్వాత పెళ్లి చేసుకునే వారు ఈ విషయాలు తప్పక గుర్తుంచుకోవాల్సిన విషయాలు
- Automobiles ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. ఇకపై ఓలా, ఉబర్, ర్యాపిడో యాప్‌ల్లో ఈ ఆప్షన్ ఉండదు.!!
- Technology ఎలోన్ మస్క్ StarLink ఇంటర్నెట్ ఇండియా లాంచ్ త్వరలోనే! ప్రభుత్వం ఆమోదించింది
- Travel Ramanarayanam Temple: విజయనగరంలోని ఈ రాములవారి ఆలయ ప్రత్యేకతలెన్నో..!
- Finance Market Closing: సెన్సెక్స్-నిఫ్టీ ఢమాల్.. మూడోరోజూ కొనసాగిన అమ్మకాల ఒత్తిడి..
తలపతి విజయ్ దూకుడు.. మాస్టర్ రిలీజ్ తర్వాత మూడు చిత్రాలకు గ్రీన్ సిగ్నల్
తమిళ సూపర్‌స్టార్ విజయ్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం ఆయన నటించిన మాస్టర్ చిత్రం రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. వాస్తవానికి ఈ చిత్రం ఏప్రిల్‌లోనే రిలీజ్ కావాల్సి ఉంది. దర్శకుడు లోకేష్ కనకరాజ్ రూపొందించిన ఈ చిత్రం లాక్డౌన్ కారణంగా విడుదల ఆగిపోయింది. అయితే మాస్టర్ రిలీజ్ కాకుండానే మరో మూడు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.
తన కెరీర్లో 65వ చిత్రంగా రూపొందే సినిమాను సన్ పిక్చర్స్ నిర్మించనున్నది. ఈ చిత్రానికి ఏఆర్ మురగదాస్ దర్శకత్వం వహిస్తారని.. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్తుందని కోలీవుడ్ మీడియా కోడైకూస్తున్నది.
అదే ఊపులో తన కెరీర్లో 66వ చిత్రానికి కూడా విజయ్ సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఈ చిత్రాన్ని మెర్సల్ రూపొందించిన శ్రీ తెనాండల్ స్టూడియోస్ నిర్మించనున్నది. ఈ చిత్రానికి పాండిరాజ్ దర్శకత్వం వహిస్తారనే వార్త చక్కర్లు కొడుతున్నది. ఈ చిత్రం పక్కా ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతున్నట్టు సమాచారం.
ఇక ఈ రెండు సినిమాల తర్వాత మరో సినిమాకు కూడా పచ్చజెండా ఊఫినట్టు తెలుస్తున్నది. ఎక్స్ బీ ఫిల్మ్ క్రియేటర్స్, సెవెన్ స్క్రీన్ స్టూడియస్ సంయుక్తంగా నిర్మించే సినిమాలో నటించడానికి సంసిద్ధతను వ్యక్తం చేసినట్టు సమాచారం. ఇంకా ఇప్పటికే సుధా కొంగర, శశికుమార్, తిరుమెని, అరుణ్ రాజా కామరాజ్, మోహన్ రాజా చెప్పిన కథలపై ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం.
ఇక మాస్టర్ చిత్రంలో విజయ్‌తో పాటు విజయ్ సేతుపతి నటిస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి విలన్ పాత్రను పోషిస్తున్నారు. అయితే త్వరలో విడుదల చేయబోయే రెండో పోస్టర్ విజయ్ సేతుపతి ఫోటోతో విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్టు సమాచారం. విజయ్ సేతుపతి క్యారెక్టర్‌ను దర్శకుడు లోకేష్ కనకరాజ్ విభిన్నంగా తీర్చిదిద్దినట్టు తెలుస్తున్నది.