ఇళయ దళపతికి బిగ్ షాక్.. ఊహించని కాంట్రవర్సీలో విజయ్!
ప్రెజెంట్ సౌత్ సినిమా దగ్గర ఉన్నటువంటి బిగ్గెస్ట్ స్టార్స్ లో చాలా మంది తమ భారీ స్టార్డం నుంచి పలువురు డైరెక్ట్ రాజకీయాల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఈ స్టార్స్ లో కొందరు నేరుగా పార్టీ పెట్టిన వారు కూడా ఉన్నారు. ఇంకొందరు అయితే పెట్టి తీసేసిన వారూ ఉన్నారు ఇంకొందరు మొండిగా నిలబడిన వారు కూడా ఉన్నారు.
కాగా మన తెలుగు నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన అనే పార్టీ పెట్టి ఇపుడు ఇపుడు ఉప ముఖ్యమంత్రిగా కూడా తాను నిలిచారు. మరి తనతో పాటుగా తమిళ నాట తన రేంజ్ క్రేజ్ ఉన్నటువంటి బిగ్ స్టార్ విజయ్ దళపతి కూడా పార్టీ పెట్టి తన పీక్ సినీ ఫామ్ ని వదులుకొని మరీ రాజకీయాల్లోకి రావడం తన అభిమానులుకి ఒకింత బిగ్ షాక్ గా నిలిచింది.

ఇలా దళపతి విజయ్ తమిళగ వెట్రి కళగం అనే పార్టీ పెట్టి భారీ ఆవిర్భావ సభని కూడా విజయ్ పెట్టాడు. అయితే తన పొలిటికల్ పార్టీ పెట్టడం తోనే అక్కడ అధికార పార్టీపై నేరుగా దాడి చెయ్యడం స్టార్ట్ చేసి సంచలనం రేపాడు. కాగా ఇలా రాజకీయాల్లో కూడా ఎప్పటికప్పుడు యాక్టీవ్ గా కనిపిస్తున్న విజయ్ కి ఇపుడు బిగ్ షాక్ తగిలింది.
కాగా విజయ్ ఇటీవల రంజాన్ మాసం ఆరంభం కావడంతో తమిళ నాట ఉన్న ముస్లింలు అందరికీ ఇఫ్తార్ విందు ఇప్పించారు. దీనికి అనేకమంది ముస్లింలు కూడా హాజరయ్యారు. అయితే విజయ్ ఇచ్చిన ఈ ఇఫ్తార్ విందుపై మరికొందరు ముస్లింలు విజయ్ తీరు పట్ల అసహనం వ్యక్తం చేసి తమిళనాడులో కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది.
విజయ్ ఇచ్చిన ఇఫ్తార్ విందులో కొందరు ముస్లింలు కానీ వారు కూడా మద్యం సేవించి వచ్చినవారు కూడా ఉన్నారని పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలు ఎవరూ అలా చేయరని విజయ్ ఎందుకు అలాంటి వారిని ఆహ్వానించారు అంటూ అసహనం వ్యక్తం చేసారు. అంతే కాకుండా విజయ్ కి సంబంధించి పర్శనల్ సెక్యూరిటీ బృందం చాలా అతిగా ప్రవర్తించారు అని వారు అంటున్నారు.
వారు తమని అవమానించే విధంగా ప్రవర్తించారు అంటూ సున్నత్ జమాత్ కంప్లైంట్ చేసినట్టుగా తెలుస్తుంది. దీనితో విజయ్ ఏదో అనుకోని ప్లాన్ చేసుకున్న ఇఫ్తార్ విందు ఇలా బెడిసికొట్టింది అని పలు కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి దీనిపై విజయ్ ఏమన్నా క్లారిటీ ఇస్తారో లేదో అనేది వేచి చూడాలి.
కాగా ఇపుడు విజయ్ తన కెరీర్ చిట్ట చివరి సినిమా జన నాయగన్ అనే సినిమాలో నటిస్తుండగా ఈ చిత్రాన్ని హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో విజయ్ సరసన పూజా హెగ్డే రొమాన్స్ చేయనుండగా ప్రేమలు బ్యూటీ మమిత బైజు కూడా ఈ సినిమాలో కీలక పాత్ర చేస్తుంది. కాగా ఈ సినిమా నట సింహం బాలయ్య భగవంత్ కేసరి సినిమాకి రీమేక్ అనే టాక్ ఉంది.


Click it and Unblock the Notifications











