Don't Miss!
- News పవన్ అప్పుల చిట్టా రూ. 46,70,00,000: `వదిన` దగ్గర పర్సనల్ లోన్
- Sports CSKకి కొత్త సమస్య.. ప్లేఆఫ్స్ చేరాలంటే ఎలా?
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
విజయ్ మూవీ అప్డేట్.. దళపతి ఫ్యాన్స్‌కు న్యూ ఇయర్ పండగే
తమిళ దళపతి విజయ్ బిగిల్ అంటూ వసూళ్ల సునామిని సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం దాదాపు 300 కోట్లను కొల్లగొట్టినట్టు సమాచారం. మెర్సెల్, సర్కార్, బిగిల్ ఇలా హిట్ల మీద హిట్లు కొడుతున్న విజయ్.. తమిళ నాట సంచలనాలు క్రియేట్ చేస్తున్నాడు. ఓ వైపు బిగిల్ సక్సెస్ కావడంతో.. మరోవైపు తన తదుపరి ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టాడు.
'విజిల్' అంటూ తెలుగులో రిలీజ్ చేసిన ఈ చిత్రానికి మంచి స్పందన వచ్చింది. ఇక్కడ కూడా భారీ విజయాన్ని నమోదు చూసింది. విజయ్ ప్రస్తుతం ఖైదీ చిత్రాన్ని తెరకెక్కించిన లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ డిల్లీలో జరుగుతోందని సమాచారం.. ఇంకో నాలుగైదు రోజుల్లో ఆ షెడ్యూల్ ముగుస్తుందని టాక్. ఇప్పటికే సినిమా టైటిల్ ఏమిటనేది నిర్ణయించారట. తమిళ సినీ వర్గాల సమాచారం మేరకు 'సభవం' అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది.
జనవరి 1వ తేదీన టైటిల్, ఫస్ట్ లుక్ రివీల్ చేస్తారని కూడా అంటున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం సమకూరుస్తున్నారు. విజయ్ సేతుపతి విలన్‌గా నటిస్తుండగా మాళవిక నాయర్ కథానాయిక. శాంతను, ఆంథోని వర్గీస్, రమ్యా తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు. 'బిగిల్' చిత్రంతో విజయ్, 'ఖైదీ' చిత్రంతో లోకేష్ పెద్ద హిట్లు అందుకున్నారు. ఈ రెండు సినిమాలే అటు తమిళనాడు, ఇటు తెలుగు రాష్ట్రాల్లో బాగా ఆడుతున్నాయి. అందుకే వీరి కలయికలో రూపొందుతున్న కొత్త ప్రాజెక్ట్ మీద భారీ అంచనాలు నెలకొన్నాయి.