twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విజయ్ మూవీ అప్‌డేట్.. దళపతి ఫ్యాన్స్‌కు న్యూ ఇయర్‌ పండగే

    |

    తమిళ దళపతి విజయ్ బిగిల్ అంటూ వసూళ్ల సునామిని సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం దాదాపు 300 కోట్లను కొల్లగొట్టినట్టు సమాచారం. మెర్సెల్, సర్కార్, బిగిల్ ఇలా హిట్ల మీద హిట్లు కొడుతున్న విజయ్.. తమిళ నాట సంచలనాలు క్రియేట్ చేస్తున్నాడు. ఓ వైపు బిగిల్ సక్సెస్ కావడంతో.. మరోవైపు తన తదుపరి ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టాడు.

    'విజిల్' అంటూ తెలుగులో రిలీజ్ చేసిన ఈ చిత్రానికి మంచి స్పందన వచ్చింది. ఇక్కడ కూడా భారీ విజయాన్ని నమోదు చూసింది. విజయ్ ప్రస్తుతం ఖైదీ చిత్రాన్ని తెరకెక్కించిన లోకేష్ కనగరాజ్ డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ డిల్లీలో జరుగుతోందని సమాచారం.. ఇంకో నాలుగైదు రోజుల్లో ఆ షెడ్యూల్ ముగుస్తుందని టాక్. ఇప్పటికే సినిమా టైటిల్ ఏమిటనేది నిర్ణయించారట. తమిళ సినీ వర్గాల సమాచారం మేరకు 'సభవం' అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది.

    Thalapathy Vijay Lokesh Kanagarajan Movie Update On New Year

    జనవరి 1వ తేదీన టైటిల్, ఫస్ట్ లుక్ రివీల్ చేస్తారని కూడా అంటున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్‌ సంగీతం సమకూరుస్తున్నారు. విజయ్‌ సేతుపతి విలన్‌గా నటిస్తుండగా మాళవిక నాయర్‌ కథానాయిక. శాంతను, ఆంథోని వర్గీస్, రమ్యా తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు. 'బిగిల్' చిత్రంతో విజయ్, 'ఖైదీ' చిత్రంతో లోకేష్ పెద్ద హిట్లు అందుకున్నారు. ఈ రెండు సినిమాలే అటు తమిళనాడు, ఇటు తెలుగు రాష్ట్రాల్లో బాగా ఆడుతున్నాయి. అందుకే వీరి కలయికలో రూపొందుతున్న కొత్త ప్రాజెక్ట్ మీద భారీ అంచనాలు నెలకొన్నాయి.

    English summary
    Thalapathy Vijay New Movie Updates. Now He Is doing With Lokesh Kanagarajan. Buzz Is That This Movies Fisrt Look And Title May Reveals On New Year.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X