49 ఏళ్ల రికార్డు బ్రేక్..? ఒక్క అడుగు దూరంలో విజయ్ !

దళపతి విజయ్ ..తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్నారు. ఆయన పార్టీ తమిళగ వెట్రి కజగం(TVK)2026 అసెంబ్లీ ఎన్నికల్లో రెండు దిగ్గజ పార్టీలు డీఎంకే, అన్నాడీఎంకే లకు ఊహించిన విధంగా పోటీ ఇస్తోంది. దాదాపు 100పైగా స్థానాల్లో విజయాన్ని అందుకుంది. ఇప్పుడు విజయ్ పేరు కేవలం తమిళనాడు మాత్రమే కాదు ఇప్పుడు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో అధికారం దక్కించుకోవాలంటే.. 118 మ్యాజిక్ ఫిగర్ ను దాటేయాలి. ఈ తాజా పరిణామాలు చూస్తే.. ఈ మ్యాజిక్ ఫిగర్ కు అత్యంత దగ్గరగా విజయ్ పార్టీ నిలిచింది. విజయ్ దళపతి సీఎం పదవికి కేవలం ఒక అడుగు దూరంలో నిలిచారు.

విజయ్ (Vijay) ఒక ప్రభంజనంలా దూసుకపోతున్నారు. సాధారణంగా వెండితెరపై మెరిసే నటులు రాజకీయాల్లోకి అడుగుపెట్టడం కొత్తేమి కాదు. ఎం.జీ.ఆర్ నుంచి జయలలిత వరకు, అలాగే C.N.అన్నాదురై, కరుణానిధి వంటి నేతలు సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వారే. అయితే.. విజయ్ విజయం మాత్రం తమిళనాడులోని దశాబ్దాల రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేలా ఉన్నారు. దిగ్గజ పార్టీలు డీఎంకే, అన్నాడీఎంకే ఊహించిన విధంగా గట్టి పోటీ ఇస్తూ.. విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) ఎన్నికల ఫలితాల్లో దూసుకుపోతుంది. ఈ తరుణంలో 49 ఏళ్ల చరిత్రను విజయ్ బ్రేక్ చేయబోతున్నాడు. ఇంతకీ ఆ రికార్డు ఏంటీ?

Thalapathy Vijay Nears CM Post TVK Surge May Break 49-Year Actor-Politician Record

అసెంబ్లీ ఎన్నికలు 2026 లో విజయ్ టీవీకే పార్టీ విజయం సాధించి, అధికారాన్ని చేజిక్కించుకుంటే.. తమిళనాడు రాజకీయాల్లో 49 ఏళ్లుగా చెక్కుచెదరకుండా ఉన్న ఓ రికార్డును బద్ధలు కాబోతుంది. గత 49 ఏళ్లుగా తమిళనాడులో ఏ సినీనటుడికి సాధ్యం కాని ఘనతను దళపతి సొంతం చేసుకొనున్నారు. టీవీకే విజయ్ ముఖ్యమంత్రి అయితే.. తమిళనాడులో పార్టీ పెట్టి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన నటుడిగా దివంగత ఎంజీఆర్ సరసన చేరనున్న విజయ్. 1977లో అన్నాడీఎంకే పార్టీ భారీ విజయంతో నాడు అగ్రహీరోగా వెలుగొందుతున్న ఎంజీ రామచంద్రన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తర్వాత అలనాటి అగ్ర కథానాయికగా ఉన్న జయలలిత కూడా తమిళనాడుకు సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టారు. అయితే ఆమె పార్టీ పెట్టకుండా అన్నాడీఎంకే నుంచి ముఖ్యమంత్రి అయ్యారు. దాంతో 49 ఏళ్ల తరువాత కొత్త రికార్డును క్రియేట్ చేయనున్నారు దళపతి విజయ్.

డీఎంకే నుంచి విడిపోయి ఎంజీఆర్..అన్నాడీఎంకే పార్టీని ఏర్పాటు చేసి.. 1977 ఎన్నికల్లో ఘన విజయం సాధించి, ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటి నుంచి ఆయన చనిపోయే వరకూ సుమారు దశాబ్ద కాలం తమిళనాడు సీఎంగా ఎంజీఆర్ కొనసాగారు. సినీ నటుడిగా తనకు ఉన్న క్రేజ్, ఫ్యాన్ బేస్‌ను సంస్థాగత ఓటు బ్యాంకుగా మలుచుకుని అప్పట్లో ఎంజీఆర్ సంచలనం సృష్టించారు. ఆ రికార్డును బ్రేక్ చేయడానికి చాలా మంది సెలబ్రిటీలు రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ, ప్రజా మద్దతును అధికారంగా మలచలేకపోయారు. అయితే విజయ్ ఆ ఫీట్‌కు చాలా దగ్గరగా వచ్చారు.

అయితే.. విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఓ పద్దతి ప్రకారం, ఓ ప్రణాళిక ప్రకారం జరిగింది. 2009లో ఆయన తన అభిమాన సంఘాలను విజయ్ మక్కల్ ఇయక్కం(Vijay Makkal Iyakkam)గా మారుస్తూ, వాటిని సామాజిక సేవలకు వినియోగించడం ప్రారంభించారు. సహజ విపత్తుల సమయంలో సహాయం, విద్యా సేవలు, స్థానిక సమస్యల పరిష్కారం లాంటి చర్యలతో విజయ్ ప్రజల్లో విశ్వాసాన్ని పొందారు. ఈ నెట్‌వర్క్ క్రమంగా రాజకీయ బేస్‌గా మారింది. 2011లో స్థానిక ఎన్నికల్లో ఈ సంఘం మద్దతుతో వచ్చిన విజయాలు ఆయనకు రాజకీయంగా ధైర్యాన్నిచ్చాయి. ఇంత భారీ ఫ్యాన్ బేస్‌ను ఓటు బ్యాంక్‌గా మార్చడం ఆయన స్ట్రాటజీలో కీలకంగా మారింది.

ఇక ఆ బలమైన పునాదిపైనే 2024లో విజయ్ తమిళగ వెట్రి కళగం (TVK)పార్టీని ప్రారంభించారు. ముఖ్యంగా ఎలాంటి ప్రీ-పోల్ పొత్తులు లేకుండా ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేయడం ఆయన తీసుకున్న కీలక నిర్ణయం. తమిళనాడులో దశాబ్దాలుగా కొనసాగుతున్న డీఎంకే, అన్నా డీఎంకే లాంటి దిగ్గజ రాజకీయ పార్టీలకు ప్రత్యామ్నాయం విజయ్ ముందుకు వచ్చారు. అంతేకాదు, తన సినీ కెరీర్‌కు గుడ్‌బై చెప్పి పూర్తిగా రాజకీయాలపై దృష్టి పెట్టడం ద్వారా "ఇది సైడ్ ప్రాజెక్ట్ కాదు" అనే సందేశాన్ని బలంగా ఇచ్చారు.

ప్రస్తుత కౌంటింగ్ ట్రెండ్స్ ప్రకారం.. టీవీకే 100 నుంచి 118 సీట్లలో అధిక్యంలో ఉంది. ఇది ఒక కొత్త పార్టీకి అసాధారణ ఫలితం. ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించే స్థాయిలో విజయ్ ఉన్నారు. అవసరమైతే ఇతర పార్టీల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీంతో విజయ్ సీఎం అవుతారా? అనే ప్రశ్నకు రాజకీయ వర్గాల్లో సానుకూల సంకేతాలు వినిపిస్తున్నాయి.

విజయ్ విజయంలో యువత మద్దతు కీలకం అనే చెప్పాలి. నిరుద్యోగం, విద్య, అవినీతి, పాలనలో పారదర్శకత వంటి అంశాలను ఆయన ప్రధానంగా ప్రస్తావించడం, మొదటిసారి ఓటు వేస్తున్న వర్గాన్ని ఆకట్టుకుంది. ఎంజీఆర్ కాలంలో సంక్షేమ పథకాలు ప్రధాన ఆకర్షణ కాగా, విజయ్ రాజకీయాలు "నూతన తరం ఆశలు"పై ఆధారపడి ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఆయన కమ్యూనికేషన్ స్టైల్ కూడా భిన్నంగా ఉంది. ఫైర్ బ్రాండ్ ప్రసంగాలకంటే, ఓటర్ల సమస్యల పరిష్కరించేలా హామీలు ఇవ్వడంతో కొత్త ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నారు.

ఇలా ఎన్నో అవరోదనాలను ఎదుర్కొంటూ అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ ప్రభంజనం మారారు. ప్రస్తుతం విజయ్.. సీఎం కూర్చీకి ఒక్క అడుగు దూరంలో నిలిచారు. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాలను పూర్తిగా మార్చే అవకాశముంది. విజయ్ రాజకీయాల్లోకి రావడం ఒక వ్యక్తిగత నిర్ణయం మాత్రమే కాదు.. ఇది తమిళనాడు రాజకీయాల భవిష్యత్తును ప్రభావితం చేసే పరిణామం.నిజంగా 49 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టి విజయ్ సీఎం అవుతారా? లేక రాజకీయ సమీకరణాలను మార్చే శక్తిగా మిగిలిపోతారా? ఈ ప్రశ్నలకు సమాధానం రాబోయే గంటల్లో స్పష్టమవుతుంది. కానీ ఒక విషయం మాత్రం ఖాయం.. 2026 ఎన్నికలు తమిళనాడు రాజకీయ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాయి.

Read more about: thalapathy vijay tvk tamil nadu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X