twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సూపర్ స్టార్ విజయ్ రాజకీయాల్లోకి.. ఎన్నికల సంఘంలో నమోదు.. పార్టీ పేరు ఇదేనంటూ..

    |

    దక్షిణాది సినీ రంగంలో వరుస ఘన విజయాలతో దూసుకెళ్తున్న ఇళయ దళపతి విజయ్ తన జీవితంలో కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టు ఊహగానాలు తమిళ మీడియాలో బలంగా వినిపిస్తున్నాయి. ఎప్పటి నుంచో రాజకీయాల్లోకి వస్తున్నట్టు రూమర్లు వినిపిస్తుండగా.. ఇప్పుడు వాటికి బలం చేకూరేలా ఆయన అడుగులు పడుతున్నట్టు స్పష్టమవుతున్నాయి. తాను పెట్టబోయే రాజకీయ పార్టీ పేరు, దాని వివరాలు ఏమిటంటే..

     గత మూడేళ్లుగా రాజకీయ విమర్శలు

    గత మూడేళ్లుగా రాజకీయ విమర్శలు


    గత రెండు, మూడేళ్లుగా విజయ్ దళపతి తన చిత్రాలతో రాజకీయాలపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. మెర్సల్, సర్కార్, బిగిల్ చిత్రాల్లో పక్కాగా రాజకీయ విమర్శలు, సైటైర్లు కనిపించాయి. దీంతో తన రాజకీయ ప్రవేశం గురించి అభిమానులకు, ప్రజలకు సంకేతాలిస్తున్నారనే అభిప్రాయం సినీ వర్గాల్లో వ్యక్తమైంది.

    విజయ్ నమోదు చేసిన రాజకీయ పార్టీ పేరు

    విజయ్ నమోదు చేసిన రాజకీయ పార్టీ పేరు

    ఇక ఇలాంటి ఊహాగానాల మధ్య భారత ఎన్నికల సంఘంలో తన రాజకీయ పార్టీని నమోదు చేసుకోబోతున్నారనే విషయం బయటకు వచ్చింది. తన పార్టీ పేరును ఆల్ ఇండియా విజయ్ మక్కల్ ఇయాక్కమ్ అని నమోదు చేసిన్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఆయన అభిమానులు గానీ, సన్నిహితులు గానీ ఈ విషయంపై పెదవి విప్పకపోవడంతో మరింత ఆసక్తి పెరిగింది.

     సంబరాల్లో విజయ్ ఫ్యాన్స్

    సంబరాల్లో విజయ్ ఫ్యాన్స్

    విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశించబోతున్నారనే విషయం అభిమానులను ఉత్తేజానికి గురిచేస్తున్నది. ఫ్యాన్స్ ఇప్పటికే సంబరాలు చేసుకొనే పనిలో ఉన్నారు. తమ అభిమాన నటుడు తన జీవితంలో ముందుగానే నిర్ణయం తీసుకోవడం వారి సంతోషానికి కారణమైంది. ఇక విజయ్ తన నిర్ణయాన్ని ఎప్పుడెప్పుడు ప్రకటిస్తారా అనే విషయం కోసం ఎదురుచూస్తున్నారు.

    ఎంజీఆర్, ఎన్టీఆర్ కంటే భిన్నంగా

    ఎంజీఆర్, ఎన్టీఆర్ కంటే భిన్నంగా

    దక్షిణాది సినీ పరిశ్రమలో ఇప్పటి వరకు రాజకీయాల్లోకి వచ్చిన వారు చాలా మందే ఉన్నారు. ఎంజీఆర్, కరుణానిధి, ఎన్టీఆర్, కమల్ హాసన్ లాంటి వాళ్లు 60 పడిలో పాలిటిక్స్‌లోకి వస్తే... వారికి భిన్నంగా రాజకీయ ప్రవేశం చేయడానికి ఎత్తుగడలు పన్నడం సానుకూలంగా మారే అవకాశం ఉంది.

    2021 ఎన్నికల లక్ష్యంగా రాజకీయాల్లోకి..

    2021 ఎన్నికల లక్ష్యంగా రాజకీయాల్లోకి..


    ఇక తమిళనాడులో 2021లో ఎన్నికలు జరుగబోతున్నాయి. ఈ తరుణంలో ఆయన రాజకీయ ప్రవేశానికి రంగం సిద్ధం చేసుకొంటున్నారు. 2021లో పోటీ చేసి.. పార్టీని 2025లో జరిగే ఎన్నికల వరకు బలోపేతం చేస్తారనే ఊహగానాలు వినిపిస్తున్నాయి. అయితే అధికారికంగా ఎలాంటి సమాచారం బయటకు పొక్కనివ్వడం లేదనే ప్రచారం జరుగుతున్నది. అయితే ఆల్ ఇండియా విజయ్ మక్కల్ ఇయాక్కమ్ అనే పార్టీని నమోదు చేయలేదు.. చేయ బోవడం లేదు. దానికి సంబంధించిన వార్తల్లో వాస్తవం లేదు అంటూ ఆయన సన్నిహితులు పేర్కొన్నారు.

    English summary
    Kollywood Super star Thalapathy Vijay moving into Politcs. Reports suggest that He has registered his political party as All India Vijay Makkal Iyakkam with Election Commission of India. But His followers condemns the news in Kollywood media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X