సమ్మర్ రేసులో విజయ్ 'బీస్ట్'.. అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది.. సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
దళపతి విజయ్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. ఆయన హీరోగా నటిస్తున్న బీస్ట్ సినిమాకు సంబందించిన అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ కాబోతోంది అనే విషయాన్ని హీరో విజయ్ ప్రకటించారు. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ 2021 సంక్రాంతి కానుకగా.. 'మాస్టర్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ అందుకున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం ఈ హీరో 'బీస్ట్' సినిమా షూటింగ్ లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్‌లో రాబోతోన్న ఈ మూవీలో విజయ్ తో పూజా హెగ్డే రొమాన్స్ చేయబోతోంది. ఇక చానాళ్ళ తరువాత ఈ సినిమాతోనే పూజా హెగ్డే కోలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతోంది.
ఈ సినిమా షూటింగ్ చెన్నైలో జరుగుతోంది. భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాకు అనిరుధ్ స్వరాలను సమకురుస్తూ ఉండగా ఈ సినిమాను సన్ పిక్షర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇక ఈ సినిమా మీద ఫ్యాన్స్ లో బీబత్సమైన అంచనాలు ఉన్నాయి. ఆ సంగతి పక్కన పెడితే ఇప్పుడు తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్డేట్ ను సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు హీరో విజయ్. అదేమంటే ఈ సినిమా 2022 ఏప్రిల్ లో విడుదల చేయబోతున్నట్లు ఆయన ప్రకటించారు. సమ్మర్ లో పవర్ ప్యాక్డ్ కాంబోగా రాబోతున్న ఈ సినిమా నుండి విడుదలైన కొన్ని పోస్టర్లు ఆకట్టుకున్నాయి. ఇప్పుడు విడుదల చేసిన పోస్టర్ మరింత ఆసక్తి రేకెత్తించే విధంగా ఉంది.

ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ బీస్ట్ సినిమా మీద ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతే కాక ఇప్పటికే ఈ సినిమా డిజిటల్ రైట్స్ అమ్ముడు పోయాయని ప్రచారం జరుగుతోంది. ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్ దక్కించుకుందని ప్రచారం జరుగుతోంది. అధికారిక ప్రకటన అయితే వెలువడలేదు కానీ ఈ సినిమా రైట్స్ కోసం భారీ మొత్తాన్ని నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఇక మరో పక్క ఈ సినిమా తర్వాత తెలుగులో కూడా విజయ్ డైరెక్ట్ ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో రానున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మించనున్నారు. ఈ సినిమా అధికారిక ప్రకటన కూడా వెలువడింది. కానీ షూట్ ఎప్పుడు మొదలవుతుంది ? అనే విషయం మీద ఎలాంటి క్లారిటీ లేదు.


Click it and Unblock the Notifications











