హృదయాలు గెలుచుకున్న విజయ్.. తప్పిన పెద్ద ప్రమాదం, ఇనుప కంచెనే విరిచేశారు!

Recommended Video

Hero Vijay Turns Into Real Life Hero,To Save His Fans | Filmibeat Telugu

ఇళయ దళపతి విజయ్ ప్రస్తుతమ్ అట్లీ దర్శత్వంలో ఫుట్ బాల్ క్రీడ నేపథ్యంలో సాగే చిత్రంలో నటిస్తున్నాడు. విజయ్ ఈ చిత్రంలో ఫుట్ బాల్ కోచ్‌గా నటిస్తున్నాడు. వరుస విజయాలతో విజయ్ క్రేజ్ రోజు రోజుకు పెరుగుతోంది. గత ఏడాది విడుదలైన సర్కార్ చిత్రం ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. కత్తి, తుపాకీ, తేరి, మెర్సల్, సర్కార్ ఇలా బ్లాక్ బస్టర్ విజయాలతో విజయ్ తమిళంలో తిరుగులేని హీరోగా మారిపోయాడు. విజయ్ అంటే పిచ్చెక్కి పోయే అభిమానులు ఉన్నారు. ఆ అభిమానుల వల్లే విజయ్‌కు తరచుగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తాజాగా షూటింగ్ లొకేషన్‌లో విజయ్ ఫాన్స్ చేసిన నిర్వాకానికి సంబందించిన వీడియో సోషల్ ఇండియాలో వైరల్ అవుతోంది.

 క్రేజీ కాంబినేషన్

క్రేజీ కాంబినేషన్

అట్లీ, విజయ్ కాంబినేషన్‌లో వచ్చిన రెండు చిత్రాలు తేరి, మెర్సల్ ఘనవిజయం సాధించాయి. ఇప్పుడు హ్యాట్రిక్ చిత్రం రాబోతోంది. ఈ చిత్రానికి టైటిల్ ఇంకా ఖరారు కాలేదు. భారత దేశంలో క్రీడా రంగంలో జరుగుతున్న రాజకీయాలని అట్లీ ఈ చిత్రం ద్వారా వెలికి తీయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మెర్సల్ చిత్రం ద్వారా వైద్యరంగంపై విమర్శలు సంధించిన సంగతి తెలిసిందే.

షూటింట్ లొకేషన్‌లో

షూటింట్ లొకేషన్‌లో

వరుస విజయాలతో విజయ్ తమిళంలో టాప్ హీరోగా మారిపోయాడు. విజయ్ ని చూడాలనే కోరికతో అతడు ఎక్కడికి వచ్చినా అభిమానులు భారీ సంఖ్యలో గుమిగూడుతున్నారు. చెన్నైలోని ఓ కళాశాలలో అట్లీ, విజయ్ చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. విజయ్‌ని చూసేందుకు కాలేజీ బయట పెద్ద ఎత్తున అభిమానులు చేరుకున్నారు. కళాశాల చుట్టూ ఇనుప కంచె ఉంది. విజయ్ అభిమానులని పలకరించడానికి దగ్గరగా వెళ్లిన సమయంలో ఊహించని సంఘటన చోటు చేసుకుంది.

 కంచెనే విరిచేశారు

కంచెనే విరిచేశారు

విజయ్ దగ్గరకు రాగానే అభిమానులు అత్యుత్సాహాన్ని గురయ్యారు. ఇనుప కంచెని సైతం తోసేయడానికి ప్రయత్నించారు. విజయ్ అభిమానులని సముదాయిస్తున్నా వినలేదు. అభిమానుల తాకిడికి ఒక్కసారిగా కంచె విరిగిపోయింది. వేగంగా స్పందించిన విజయ్ కంచెకు అడ్డుగా నిలిచాడు. విజయ్ చుట్టూ చాలా మంది బౌన్సర్లు ఉన్నారు. కానీ విజయ్ వెంటనే స్పందించి అభిమానులకు ప్రమాదం జరగకుండా అడ్డుకున్నాడు. కంచె ఒక్కసారిగా కింద పడి ఉంటే తొక్కిసలాటలో చాలా మంది ఫ్యాన్స్ కు గాయలయ్యేవి.

వైరల్ అవుతున్న వీడియో

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విజయ్ సందర్బోచితంగా స్పందించి పెద్ద ప్రమాదాన్ని అడ్డుకున్నాడని అభిమానులు ప్రశంసిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం కూడా విజయ్ షూటింగ్ ముగించుకుని వెళుతుండగా అతడి కారుని వెంబడిస్తూ ప్రమాదకరంగా అభిమానులు బైకులు నడిపిన సంగతి తెలిసిందే. విజయ్ కారు అద్దం దించి తన వెంట పడొద్దంటూ అభిమానులకు చెప్పాల్సి వచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X