Jana Nayagan: విజయ్ దళపతి షాకింగ్ రెమ్యునరేషన్.. ‘జన నాయకుడు' కోసం అన్ని వందల కోట్లా?
కోలీవుడ్ బాక్సాఫీస్ బాద్‌షా, దళపతి విజయ్ (Thalapathy Vijay) చివరి సినిమా 'జన నాయగన్' (Jana Nayagan). రాజకీయాల్లోకి పూర్తి స్థాయిలో ప్రవేశించేముందు విజయ్ నటిస్తున్న ఈ చివరి సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. సినిమా కంటెంట్ కన్నా ఎక్కువగా, ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన బడ్జెట్, పారితోషికాలే ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా విజయ్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ వింటే ఆశ్చర్యపోవాల్సిందే అన్న టాక్ వినిపిస్తోంది.
జన నాయగన్ హీరో విజయ్ రెమ్యునరేషన్‌తో పాటు, ఈ సినిమా మొత్తం బడ్జెట్ కూడా భారీ స్థాయిలో ఉందని టాక్. 'జన నాయకుడు'ను దాదాపు రూ.365 నుంచి రూ.380 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇది కోలీవుడ్‌లో ఇప్పటివరకు వచ్చిన అత్యంత భారీ బడ్జెట్ సినిమాల్లో ఒకటిగా నిలవనుందని అంటున్నారు. ఈ సినిమాను 2026 జనవరి 9న సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే.. సినిమా సెన్సార్ కష్టాల్లో చిక్కుకుంది.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం మూవీ కాస్ట్ రెమ్యూనరేషన్ విషయాలు హాట్ టాపిక్ గా మారాయి. ముందుగా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నది 'వలిమై' ఫేమ్ హెచ్. వినోద్ (H.Vinoth). ఆయనకు సుమారు రూ.25 కోట్ల పారితోషికం ఇచ్చినట్లు సమాచారం. ఇక సంగీత దర్శకుడిగా పనిచేస్తున్న రాక్ స్టార్ అనిరుద్ రవిచందర్ (Anirudh Ravichander)కు దాదాపు రూ.13 కోట్ల రెమ్యునరేషన్ అందుతున్నట్లు టాక్. ఈ లెక్కల ప్రకారం హీరో తర్వాత అత్యధికంగా పారితోషికం తీసుకునే వ్యక్తి అనిరుధ్ కావడం విశేషం.
నటీనటుల విషయానికి వస్తే, విజయ్ సరసన హీరోయిన్‌గా పూజ హెడ్గే (Pooja Hegde)నటిస్తుండగా, ఆమెకు సుమారు రూ.3 కోట్ల పారితోషికం ఇస్తున్నట్లు తెలుస్తోంది. విలన్ పాత్రలో నటిస్తున్న బాబీ డియోల్(Bobby Deol)కూడా అదే స్థాయిలో రెమ్యునరేషన్ అందుకున్నారని సమాచారం. అలాగే కీలక పాత్రలో కనిపిస్తున్న మమితా బైజు(Mamitha Baiju)కు సుమారు రూ.50-60 లక్షలు ఇస్తున్నట్లు టాక్. సీనియర్ నటులు ప్రకాశ్ రాజ్, ప్రియమణి, గౌతమ్ వాసుదేవ్ మీనాన్, నరేన్ తదితరులకు కలిపి దాదాపు రూ.8-10 కోట్ల వరకు ఖర్చవుతోందని సమాచారం.
ఇక కోలీవుడ్ ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సినిమా కోసం దళపతి విజయ్ (Vijay) ఏకంగా రూ.220 కోట్లకు పైగా పారితోషికం తీసుకున్నారట. ఇది నిజమైతే, షారుఖ్ ఖాన్, రజనీకాంత్, ప్రభాస్ వంటి స్టార్‌లను దాటి భారతీయ సినిమా చరిత్రలోనే అత్యధిక పారితోషికం తీసుకున్న నటుడిగా విజయ్ నిలవడం ఖాయం. రాజకీయాల్లోకి వెళ్లేముందు తన అభిమానులకు ఓ గ్రాండ్ వీడ్కోలు పలికేలా ఈ సినిమాను విజయ్ ప్రత్యేకంగా ప్లాన్ చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
ఇంకో ఆసక్తికర అంశం ఏమిటంటే.. ఈ సినిమా బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి(Bhagavanth Kesari)కి రీమేక్‌గా రూపొందుతోంది. అయితే విజయ్ రాజకీయ ఇమేజ్‌కు తగ్గట్లుగా కథలో పలు మార్పులు చేశారని, స్ట్రాంగ్ పొలిటికల్ టచ్‌తో ఈ సినిమాని కొత్తగా తీర్చిదిద్దుతున్నారని తెలుస్తోంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది.
మొత్తంగా చూస్తే.. కేవలం ఆర్టిస్టులు, టెక్నీషియన్ల పారితోషికాలకే దాదాపు రూ.300 కోట్ల వరకు ఖర్చవుతుండగా, మిగిలిన బడ్జెట్‌తో సినిమా నిర్మాణం పూర్తయ్యిందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రాజకీయాల్లోకి వెళ్లేముందు తన చివరి సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేయాలనే పట్టుదలతో ఉన్న విజయ్, 'జన నాయకుడు'తో ఎలాంటి రికార్డులు సృష్టిస్తారన్నది ఇప్పుడు కోలీవుడ్ మొత్తం ఎదురుచూస్తోంది.


Click it and Unblock the Notifications











