దర్శకుడిగా సూపర్ స్టార్ కుమారుడు ఎంట్రీ.. భారీ బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్స్ పాన్ ఇండియా మూవీ!
ఇండియన్ సినిమా పరిశ్రమకు మరో సూపర్ స్టార్ కుమారుడు డైరెక్టర్‌గా పరిచయం కాబోతున్నారు. ఈ సూపర్ స్టార్ కుమారుడిని సంచలన చిత్రాలను నిర్మించిన లైకా ప్రొడక్షన్స్ దర్శకుడిగా పరిచయం చేయడం విశేషంగా మారింది. తమిళ ఇళయదళపతి, సూపర్ స్టార్ విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ విజయ్‌ని తమ తదుపరి సినిమాకు డైరెక్టర్‌గా బోర్డుపైకి తీసుకొచ్చినట్టు లైకా ప్రొడక్షన్ అధినేత సుభాస్కరన్ అధికారికంగా ప్రకటన చేశారు. ఆ ప్రకటన వివరాల్లోకి వెళితే..
సూపర్ స్టార్ విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ విజయ్ సినిమా ఎంట్రీ గురించి కొద్దికాలంగా మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే హీరోగా రావాలని అభిమానులు కోరుకొంటే.. విజయ్ తన కుమారుడిని దర్శకుడిగా పరిచయం చేయాలని నిర్ణయించాడు. జాసన్ సంజయ్ విజయ్ టొరెంటో ఫిల్మ్ స్కూల్ నుంచి ఫిల్మ్ ప్రొడక్షన్స్‌లో డిప్లోమా డిగ్రీని సాధించాడు. ఆ తర్వాత 2020 నుంచి 2022 వరకు స్క్రీన్ రైటింగ్ విభాగంలో చేరి లండన్‌లో ప్రముఖ విద్యా సంస్థ నుంచి బీఏ హానర్‌లో డిగ్రీ అందుకొన్నారు.

జాసన్ సంజయ్ విజయ్‌ను దర్శకుడిగా లైకా ప్రొడక్షన్స్ అధినేత ఏ సుభాస్కరన్ పరిచయం చేస్తూ.. లైకా ప్రొడక్షన్స్ ఎప్పుడూ ఫ్రెష్ ఆలోచనలతో ఉండే యంగ్ టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్స్‌తో పనిచేస్తుంది. యువ ఫిల్మ్ మేకర్ల ఆలోచన్లను బలంగా నమ్ముతుంది. వారే ఫిల్మ్ ఇండస్ట్రీ గేమ్ ఛేంజర్ అని భావిస్తుంది. మా నెక్ట్స్ ప్రాజెక్టును జాసన్ సంజయ్ విజయ్ డైరెక్ట్ చేయబోతున్నాడు. ఆయన దర్శకత్వం వహించే సినిమా కథ వినూత్నంగా, విభిన్నంగా ఉండబోతుంది అని అన్నారు.

జాసన్ సంజయ్ విజయ్ కథ చెప్పినప్పుడు అద్బుతమైన సినిమాటిక్ ఫీల్ కలిగింది. ఆయన డైరెక్షన్, స్క్రీన్ రైటింగ్‌లో సాధించిన ప్రత్యేకతలు చూస్తే ముచ్చటేసింది. ప్రొడక్షన్ డిజైన్‌లో పూర్తి అవగాహన ఉంది. సినిమా పరిశ్రమలో మాస్టర్ ఫిల్మ్ మేకర్ కావడం తథ్యం. జాసన్ సంజయ్ విజయ్‌ను లాంచ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. త్వరలోనే నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను అధికారికంగా ప్రకటిస్తాం అని సుభాస్కర్ తెలిపారు.
జాసన్ సంజయ్ విజయ్ మాట్లాడుతూ.. నా మొదటి సినిమానే లైకా ప్రొడక్షన్స్ లాంటి ప్రఖ్యాత సినీ నిర్మాణ సంస్థలో చేయడం, అవకాశం రావడం గర్వంగా ఉంది. కొత్త ఫిల్మ్ మేకర్స్‌కు, టాలెంట్‌కు ఈ సంస్థ అడ్డా లాంటింది. నా స్క్రిప్టును వారు అంగీకరించినందుకు చాలా థ్యాంక్స్. నా కథను పూర్తిగా నమ్మడమే కాకుండా క్రియేటివ్ స్వేచ్చను ఇచ్చారు. ఇండస్ట్రీలో గొప్పగా రాణిస్తున్న యువ నటీనటులతో, సాంకేతిక నిపుణులతో చర్చలు జరుగుతున్నాయి. గొప్ప దర్శకుడిని అవుతానని భావించిన తమిళ్ కుమారన్‌కు థ్యాంక్స్‌తోపాటు రుణపడి ఉంటాను అని అన్నాడు.

ఇండియన్ సినిమా పరిశ్రమలో లైకా ప్రొడక్షన్స్ సంచలనాలు సృష్టిస్తున్నది. కత్తి సినిమాతో నిర్మాణ రంగంలోకి ప్రవేశించిన ఈ సంస్థ వడాచెన్నై, దర్బార్, డాన్, పొన్నియన్ సెల్వన్, రామ్ సేతు, చంద్రముఖి 2, లాల్ సలాం, ఇండియన్ 2 చిత్రాలను నిర్మిస్తున్నది.


Click it and Unblock the Notifications











