గెలుపు మనదే..తమిళ రాజకీయాల్లో విజయ్ మరో సంచలనం.. క్రేజీగా తమన్‌తో కలిసి..!

తమిళ సూపర్ స్టార్ విజయ్ తన రాజకీయ రంగ ప్రవేశానికి మరింత బలం చేకూర్చారు. ఇటీవల తమిజగ వెట్రీ కజగం పార్టీని ప్రకటించిన ఆయన పాలిటిక్స్‌లో మరో ముందడుగు వేశాడు. పానాయూర్ పార్టీ ఆఫీస్‌లో కార్యకర్తల సమక్షంలో ఆయన పార్టీ జెండాను, అధికారిక గేయాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అభిమానులను, పార్టీ కార్యకర్తలు, నేతలు, సానుభూతిపరులను ఉత్తేజ పరిచే విధంగా ప్రసంగించారు. విజయ్ చేసిన ప్రసంగం గురించిన వివరాల్లోకి వెళితే..

కోలీవుడ్‌లో సూపర్ స్టార్‌గా రాణిస్తున్న విజయ్ గత ఫిబ్రవరి మాసంలో రాజకీయ పార్టీని ప్రారంభిస్తున్నట్టు ప్రకటన చేశారు. తమిళనాడులో 2026 సంవత్సరంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. దాంతో గత లోక్‌సభ ఎన్నికలకు దూరంగా ఉండటమే కాకుండా ఏ పార్టీకి మద్దతు కూడా ప్రకటించకుండా ఎన్నికల సరళిని పరిశీలించారు.

Thalapathy Vijay unveiled Tamizhaga Vetri Kazhagam party flag official Song composed by SS Thaman

విజయ్ ఆవిష్కరించిన జెండా వివరాల్లోకి వెళితే.. మెరూన్ కలర్ జెండాలో మధ్యలో పసుపు పచ్చ రంగు అడ్డంగా ఓ పెద్ద బ్లాక్.. దానిపై రెండు ఏనుగులు శివతాడవం చేస్తున్నటుగా ఉన్న ఫోటోల మధ్య పావురం, నక్షత్రాలు ఉన్నాయి. ఈ పతాక ఆవిష్కరణ కార్యక్రమానికి భారీగా అభిమానులు తరలివచ్చారు.

ఇక పార్టీ అధికార గేయానికి సంగీతం ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ తమన్ అందించారు. ఈ పాటను రచయిత వీ వివేక్ రాశారు. పాట రిలీజ్ చేయగానే అభిమానులు గేయంపై ఉత్సాహంగా స్టెప్పులేసి ఆనందంలో మునిగిపోయారు. ఈ కార్యక్రమంలో దాదాపు 300 అభిమాన సంఘాల సభ్యులును ఆహ్వానించారు.

Thalapathy Vijay unveiled Tamizhaga Vetri Kazhagam party flag official Song composed by SS Thaman

అనంతరం కార్యకర్తలు, అభిమానులను ఉద్దేశించి విజయ్ మాట్లాడుతూ.. మొదటి పార్టీ సమావేశం కోసం మీరంతా వేచి చూస్తున్నారనే విషయం నాకు తెలుసు. ఆ ఈవెంట్ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. త్వరలోనే ఆ వివరాలను వెల్లడిస్తాం. రాష్ట్రస్థాయి సమావేశానికి ముందు పార్టీ జెండాను ఆవిష్కరించాలని భావించాం. ఈ రోజు పార్టీ జెండాను ఆవిష్కరించడం గర్వంగా ఉంది. తమిళనాడు అభివృద్ది కోసం మనమంత కలిసి పనిచేద్దాం అని విజయ్ అన్నారు.

భవిష్యత్‌లో మెరుగైన తమిళనాడును మీరు చూస్తారు. రానున్న ఎన్నికల్లో మనదే విజయం అంటూ విజయ్ ధీమా వ్యక్తం చేశాడు. అంతేకాకుండా సెప్టెంబర్ చివరి వారంలో ఉత్తర తమిళనాడులోని విక్రవాండి నుంచి పబ్లిక్ ర్యాలీని నిర్వహిస్తామని చెప్పారు. ఎన్నికల సంఘంలో పార్టీ నమోదు కార్యక్రమాలు చురుకుగా సాగుతున్నాయి అని తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X