కరోనా ఎఫెక్ట్ : తనయుడి కోసం తపన.. వైరస్‌కు భయపడుతున్న దళపతి
కరోనా వైరస్ ప్రపంచాన్ని తన గుప్పిట పట్టి పీడిస్తోంది. వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాలన్నీ షట్ డౌన్ కావాల్సి వచ్చింది. అత్యవసర కార్యకలాపాలు తప్పా మిగతావేవీ చేసుకోలేని పరిస్థితిలోకి నెట్టేసింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 19 లక్షల మంది కరోనా బారిన పడగా.. లక్ష మందికి పైగా ప్రాణాలను కోల్పోయారు. అగ్రరాజ్యం అమెరికాలోనే అత్యధిక కరోనా కేసులు, మరణాలు సంభవిస్తున్నాయి. ఇదిలా ఉండగా దళపతి విజయ్ తన కుమారుడి కోసం బాధపడుతున్నాడని తెలుస్తోంది. ఆ వివరాలేంటో ఓ సారి చూద్దాం.

కరోనా విజృంభణ..
చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలనే వణికిస్తోంది. విరుగుడు లేని ఈ వైరస్ ధాటికి ప్రపంచ మానవాళి నిలబడలేకపోతోంది. ఈ వైరస్ తాకిడికి భారతదేశం సైతం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఇప్పటికే పది వేలకు పైగా కరోనా కేసులు బయటపడగా.. దాదాపు 350కి పైగా మరణాలు సంభవించాయి.

ఎక్కివారు అక్కడే..
కరోనాను కట్టడి చేసే భాగంలో గత నెలలో 21 రోజుల లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అది నేటి (ఏప్రిల్ 14)తో ముగియడంతో మరో 19 రోజుల పాటు లాక్ డౌన్‌ను కొసాగించనున్నట్టు ప్రకటించారు. దీంతో మే 3 వరకు ఎవ్వరూ ఇంటి నుంచి బయటకు రావడానికి వీల్లేదు.

సెలెబ్రిటీలు సైతం ఇంట్లోనే..
కరోనా వైరస్ ప్రభావాన్ని తట్టుకోలేక ప్రజలంతా ఇంటి పట్టునే ఉంటున్నారు. ఈ మేరకు సినీ తారలు సైతం ఇంట్లోనే ఉంటూ తమ అభిమానులకు కూడా అదే మంచిదని సూచిస్తున్నారు. అందరిలానే ఇంటికే పరిమితమైన దళపతి విజయ్ మాత్రం.. తన కొడుకు జాసోన్ సంజయ్‌ను తలుచుకుని బాధపడుతున్నాడట.

కెనడాలో కొడుకు..
విజయ్ తన భార్య సంగీత, కూతురు దివ్యా సాషాతో కలిసి ఇంట్లోనే ఉంటుండగా.. కొడుకు మాత్రం కెనడాలో చిక్కుకుపోయాడు. నటనలో శిక్షణ తీసుకోవడానికి వెళ్లిన సంజయ్ కరోనా కారణంగా అక్కడే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అసలే అమెరికాలో కరోనా విజృంభిస్తుండటంతో కొడుకు గురించి ఆందోళన చెందుతున్నాడని సన్నిహిత వర్గాల నుంచి అందిన సమాచారం.
Recommended Video

ఇండస్ట్రీలోకి త్వరలోనే ఎంట్రీ..
విజయ్ కుమారుడు సంజయ్ ఇప్పటికే షార్ట్ ఫిలిమ్స్‌లో నటించాడు కొన్నింటికి దర్శకత్వం కూడా వహించాడు. ఇక వెండితెరపై నటించేందుకు కూడా సిద్దంగానే ఉన్నాడు. విజయ్ కొడుకు, విక్రమ్ కొడుకుతో శంకర్ ఓ మల్టీ స్టారర్ కూడా చేయబోతోన్నాడని అప్పట్లో ఓ టాక్ నడిచింది.


Click it and Unblock the Notifications











