Thalapathy Vijay: నా కొడుకుపై సంగీత నిఘా.. కోడలిపై దళపతి విజయ్ తండ్రి షాకింగ్ కామెంట్స్

కోలీవుడ్ సూపర్‌స్టార్, టీవీకే అధినేత దళపతి విజయ్ ఊహించని ఎదురుదెబ్బలతో సతమతం అవుతున్నారు. తన చివరి చిత్రం జన నాయగన్ విడుదల కాకపోగా.. కరూర్ తొక్కిసలాట, సీబీఐ విచారణలతో ఇబ్బందులు పడుతున్నారు. సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్లో విజయ్ భార్య సంగీత విజయ్ విడాకుల నోటీసు ఇవ్వడం తమిళ సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. బయటి సమస్యలతో తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న వేళ.. సొంతింటిలోనే అది కూడా తాళి కట్టిన భార్య షాక్ ఇవ్వడంతో ఆయనకు ముందు నుయ్యి, వెనుక గొయ్యిలా పరిస్ధితులు తయారయ్యాయి.

విజయ్‌- సంగీత దంపతులు విడివిడిగా ఉంటున్నారని త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారని గత కొద్దినెలలుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. విజయ్ రాజకీయాల్లో ఉండటంతో ఆయన మనోస్థైర్యాన్ని దెబ్బకొట్టడానికి రాజకీయ ప్రత్యర్ధులు ఇలా మైండ్‌గేమ్ ఆడుతున్నారన్న కామెంట్స్ వినిపించాయి. అయితే ఈ ఊహాగానాలను నిజం చేస్తూ రెండ్రోజుల క్రితం సంగీత విజయ్ షాకిచ్చారు. తన భర్త విజయ్ చంద్రశేఖర్ నుంచి విడాకులు కావాలంటూ ఆమె చెంగల్పట్టు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన భర్త ఓ నటితో వివాహేర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడని.. 2021 నుంచి ఇద్దిరి మధ్య ఈ అక్రమ సంబంధం కొనసాగుతోందని సంగీత తన పిటిషన్‌లో పేర్కొంది.

Thalapathy Vijay s father SA Chandrasekhar Old Remark Goes Viral After Wife Sangeetha Files For Divorce

ఆ నటితో బంధం గురించి ఇద్దరి మధ్య పలుమార్లు గొడవలు జరిగినప్పటికీ విజయ్‌లో ఎలాంటి మార్పు రాలేదని ఆరోపించింది. అందుకే విడాకులు తీసుకోవాలని అనుకుంటున్నట్లు పేర్కొంది. ప్రత్యేక వివాహ చట్టంలోని సెక్షన్ 21 (1) (a) మరియు 27 (1)(d) కింద సంగీత విడాకులు ఇప్పించాలని పేర్కొంది. జీవిత భాగస్వామి మరో వ్యక్తితో వివాహేతర సంబంధంలో ఉన్నట్లు లేదా అవతి వ్యక్తితో క్రూరంగా ప్రవర్తించినట్లయితే ప్రత్యేక వివాహ చట్టం, 1954 ప్రకారం కోర్టులు విడాకులు మంజూరు చేయవచ్చు. కాగా.. 1999లో ఆగస్టులో విజయ్ - సంగీత పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు జాసన్ సంజయ్, దివ్య షాషా అనే కుమారుడు, కుమార్తె ఉన్నారు.

ఈ పరిస్థితుల నేపథ్యంలో సంగీతపై విజయ్, ఆయన తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. గతంలో 2022లో నెల్సన్ దిలీప్ కుమార్‌కు ప్రత్యకంగా ఇచ్చిన ఇంటర్వూలో తన భార్య తనను వాచ్ చేస్తుందని పేర్కొన్నారు. అలాగే అసలైన విమర్శకురాలు సంగీతేనని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత విజయ్ తండ్రి, దర్శకుడు ఎస్ఏ చంద్రశేఖర్ న్యూస్‌గ్లిట్జ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ ఇదే రకమైన వ్యాఖ్యలు చేశారు. విజయ్ చాలామంది మాట వినకపోయినా సంగీత మాటకు, అభిప్రాయానికి ఎంతో విలువ ఇచ్చేవాడు. అలాగే తన కోడలు.. విజయ్‌‌పైకి, అతనికి సంబంధించిన విషయాలపై ఎప్పుడూ నిఘా వేసి ఉంచేదని చంద్రశేఖర్ అన్నారు.

అలాతే తన కోడలు ప్రతి విషయాన్ని అత్యంత ఖచ్చితత్వంతో, పరిణతితో చేసే వ్యక్తి అని సంగీతను ప్రశంసించారు. తన మనవడు, మనవరాలు పరిణతితో, క్రమశిక్షణతో పెరుగుతున్నారంటే దానికి మొత్తం క్రెడిట్ సంగీతకే చెందుతుంది. సంగీత ఎప్పుడూ దేనిలోనూ రాజీపడదు. వారికి ఇష్టమైన ఆహారం తినిపించడంతో పాటు వారిని స్కూల్‌కు పంపడం, ఇంట్లో పనులు చేయించడం సంగీత పనే. వారిని ఆమె అంత క్రమశిక్షణతో పెంచిందని ఎస్ఏ చంద్రశేఖర్ అన్నారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X