Jana Nayagan: దళపతి విజయ్ మూవీకి రూ 120 కోట్ల నష్టం?

కోలీవుడ్ సూపర్‌స్టార్, టీవీకే అధినేత దళపతి విజయ్‌కు మరో షాక్ తగిలింది. ఆయనకు వ్యక్తిగతంగా, వృత్తిగతంగా రోజుకో ఎదురుదెబ్బ తగులుతుంది. రాజకీయ పరంగా చూస్తే.. కరూర్ తొక్కిసలాట కేసుతో ఇబ్బందులు పడుతున్నారు. అదే సమయంలో ఆయన భార్య సంగీత విడాకుల కోసం చెంగల్పట్టు కోర్టులో కేసు వేయడంతో మరో కలకలం రేపింది. మరోవైపు ఆయన చివరి సినిమా జన నాయగన్ (Jana Nayagan) ఇప్పటికే సెన్సార్ వివాదాలు, విడుదల వాయిదాలతో ఇబ్బందులు ఎదుర్కొంటుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ ఒప్పందం విషయంలో కూడా షాక్ తగిలినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఏమైందంటే?

దళపతి విజయ్ తాజా సినిమా జన నాయగన్.. ఆయన రాజకీయాల్లోకి వెళ్లే ముందు చివరి సినిమా కావడడంతో ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీన్ ప్రోడక్షన్స్ ( KVN Productions) అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాకు నిర్మించగా, తమిళ దర్శకుడు హెచ్. వినోథ్ ( H. Vinoth)దర్శకత్వం వహించారు. సుమారు రూ. 300 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందించారు. వాస్తవానికి ఈ సినిమా మొదట సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సి ఉంది.

Thalapathy Vijay s Jana Nayagan Faces OTT Shock Amazon Prime Deal Rumoured Cancelled

అయితే సినిమాలోని కొన్ని రాజకీయ అంశాలు, డైలాగులపై అభ్యంతరాలు వ్యక్తమవడంతో సెన్సార్ సర్టిఫికేషన్ ప్రక్రియ ఆలస్యం అయింది. దీంతో సినిమా విడుదల అనూహ్యంగా వాయిదా పడింది. ప్రస్తుతం కూడా ఈ సినిమా సెన్సార్ సమస్యలతోనే నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ సినిమా మన తెలుగు సినిమా భగవంత్ కేసరి రీమేక్ అనే ప్రచారం కూడా సోషల్ మీడియాలో జోరుగా జరిగింది. అయితే, ఈ వార్తలను సినిమా యూనిట్ పలుమార్లు ఖండించింది. జన నాయగన్ పూర్తిగా కొత్త కథతో రూపొందిన సినిమా అని నిర్మాతలు స్పష్టం చేశారు.

ఓటీటీ డీల్ పై భారీ ట్విస్ట్
ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ ఒప్పందం విషయంలో కీలక పరిణామం చోటుచేసుకున్నట్టు సమాచారం. ప్ర0ముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) ఈ సినిమా డిజిటల్ హక్కులను భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. విజయ్ క్రేజ్, సినిమాపై ఉన్న అంచనాల నేపథ్యంలో దాదాపు రూ. 120 కోట్లకు ఈ హక్కులు తీసుకున్నట్లు సినీ వర్గాల్లో వార్తలు వినిపించాయి. కానీ, ఒప్పందంలో పేర్కొన్న సమయానికి సినిమా విడుదల కాకపోవడం, ఇంకా సెన్సార్ ప్రక్రియ పూర్తి కాకపోవడంతో అమెజాన్ ప్రైమ్ ఈ డీల్ నుంచి వెనక్కి తగ్గినట్టు సమాచారం. దీంతో ఓటీటీ హక్కుల ఒప్పందం రద్దు అయ్యిందని కోలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది.

అయితే.. ఈ విషయంపై ఇప్పటివరకు అమెజాన్ ప్రైమ్ లేదా మూవీ మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే, త్వరలోనే ఈ విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. నిజంగా ఓటీటీ డీల్ రద్దు అయితే నిర్మాతలకు భారీ ఆర్థిక ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

దళపతి విజయ్ నటించిన జన నాయగన్ పై అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. కానీ వరుస వివాదాలు, విడుదల ఆలస్యం, ఇప్పుడు ఓటీటీ డీల్‌పై వస్తున్న వార్తలు అభిమానుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రస్తుతం సెన్సార్ సమస్యలు పరిష్కారమై సినిమా విడుదల తేదీ ప్రకటించబడితేనే పరిస్థితి స్పష్టమవుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో జన నాయగన్ సినిమా ఎప్పుడు విడుదల అవుతుంది? ఓటీటీ డీల్ నిజంగానే రద్దయిందా? అన్న ప్రశ్నలు ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X