twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బ్రేకింగ్: Vijay's Rolls Royce case: మద్రాస్ కోర్టు సంచలన తీర్పు.. ఇళయ దళపతికి ఊరట!

    |

    తమిళ సూపర్ స్టార్ విజయ్‌కి సంబంధించిన రోల్స్ రాయిస్ కారు కేసు మరో మలుపు తిరిగింది. పన్ను చెల్లించాల్సిందే అంటూ ఘాటుగా వ్యాఖ్యలు చేసిన మద్రాస్ హైకోర్టు మరోసారి సంచలన నిర్ణయం తీసుకొన్నది. కొద్ది రోజుల క్రితం మద్రాస్ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలపై స్టే విధించడంతో ఇళయ దళపతి విజయ్‌కి ఊరట లభించింది. ఆ కేసు, వివాదానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే...

    Recommended Video

    Build Up Or Simplicity ? Vijay Cycle Ride పై భిన్నాభిప్రాయాలు!!
    ఇంగ్లాండ్ నుంచి రోల్స్ రాయిస్ దిగుమతి

    ఇంగ్లాండ్ నుంచి రోల్స్ రాయిస్ దిగుమతి

    తమిళ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరో విజయ్ ఇంగ్లాండ్‌ నుంచి అతి ఖరీదైన రోల్స్ రాయిస్ ఘోస్ట్ మోటార్ కారును దిగుమతి చేసుకొన్నారు. అప్పటికే ఆ కారు కోసం కస్టమ్స్ డిపార్ట్‌మెంట్‌కు దిగుమతి సుంకం చెల్లించారు. అయితే సమయంలో ఎంట్రీ ట్యాక్స్ కట్టే విషయంలో మినహాయింపు ఇవ్వండి అంటూ చెన్నై అసిస్టెంట్ కమిషనర్‌కు లేఖ రాశారు. అయితే అధికారులు ఆయన వినతిని తిరస్కరించారు.

    దిగుమతి సుంకం చెల్లించా

    దిగుమతి సుంకం చెల్లించా

    దాంతో దిగుమతి సుంకం, ఎంట్రీ ఫీజు వ్యవహారాన్ని విజయ్ కోర్టుకు విన్నవించారు. అయితే కొద్ది రోజుల క్రితం విజయ్ పిటిషన్‌ను జస్టిస్ ఎస్ఎం సుబ్రమణ్యంతో కూడిన బెంచ్‌ తిరస్కరించింది. ఎంట్రీ ఫీజు చెల్లించడంలో ఆలస్యం అయినందుకు వెంటనే లక్ష రూపాయల జరిమానా చెల్లించాలి. ఆ మొత్తాన్ని తమిళనాడు చీఫ్ మినిస్టర్స్ కోవిడ్ 19 రిలీఫ్ ఫండ్‌కు జమ చేయాలి అని హైకోర్టు తీవ్రంగా మందలించింది.

    విజయ్‌కి గతంలో చురకలు

    విజయ్‌కి గతంలో చురకలు

    అంతేకాకుండా విజయ్‌కి జస్టిస్ సుబ్రమణ్యం బెంచ్ చురకలు అంటించింది. ప్రజల దృష్టిలో సినీ హీరోలు రియల్ హీరోలు. పన్ను ఎగవేతకు పాల్పడటం దేశ ప్రయోజనాలకు వ్యతిరేకం. రాజ్యంగ వ్యతిరేక పనులు, మైండ్‌సెట్‌, ప్రవర్తనను మానుకోవాలి. సకాలంలో పన్ను చెల్లించకపోవడం రాజ్యాంగ వ్యతిరేక చర్యే అంటూ విజయ్‌కు క్లాస్ పీకింది.

    విజయ్‌పై ఘాటైన వ్యాఖ్యలు

    విజయ్‌పై ఘాటైన వ్యాఖ్యలు

    సినీ ప్రముఖులు, ఇతర సెలబ్రిటీలు దేశానికి సంపద. వారు ఆర్జించే సొమ్మంతా పేదల కష్టార్జితం. సినీ ప్రముఖులు సంపాదన ఆకాశం నుంచి ఊడి పడదు. వారు చెల్లించే పన్నులు దేశ సంక్షేమానికి దోహదపడుతాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. కాబట్టి పన్ను చెల్లించే విషయంలో ప్రముఖులు రూల్స్ పాటించాలి అని మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. అయితే విజయ్ లాయర్లు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేశారు. దాంతో మరో బెంచ్‌కు ఈ కేసును మార్చారు.

    విజయ్ వినతికి సానుకూలంగా... స్టే విధింపు

    విజయ్ వినతికి సానుకూలంగా... స్టే విధింపు

    ఇలాంటి ఘాటు వ్యాఖ్యలు హైకోర్టు చేయడంతో విజయ్ మరోసారి పిటిషన్ దాఖలు చేశారు. దాంతో తాజాగా హైకోర్టు బెంచ్ సానుకూలంగా స్పందించింది. మద్రాస్ హైకోర్టులోని జస్టిస్ ఎం దురైస్వామి, ఆర్ హేమలతతో కూడిన ధర్మాసనం గతంలో లక్ష రూపాయల జరిమానా చెల్లించాలని జారీ చేసిన ఆదేశాలను నిలిపివేస్తూ స్టే విధించింది. తదుపరి విచారణ త్వరలోనే జరుపనున్నది. దీంతో ప్రస్తుతం విజయ్‌కి ఊరట లభించింది. తుది తీర్పు ఎలా వస్తుందనే విషయం ఆసక్తిగాా మారింది.

    English summary
    Super Star Vijay's Rolls Royce case takes different turn. Honourable Justice M Duraiswamy & R Hemalatha of Madras HC stays the earlier passed order with critical remarks against. actorvijay in the Rolls Royce case and also stays the one lakh fine amount.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X