ఆ సెల్ నెంబర్ నాది కాదు...నన్ను ఇరికించొద్దు: త్రిష
డ్రగ్స్ వ్యవహారంలో పట్టుబడిన నిందితుల వద్ద తన ఫోన్ నెంబరు ఉన్నట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని ప్రముఖ హీరోయిన్ త్రిష అన్నారు. ఆ నెంబర్ తనదికాదని స్పష్టం చేశారు. బుధవారం కొడైకెనాల్ లో మీడియాతో మాట్లాడుతూ డ్రగ్స్ కేసులో నిందితుల వద్ద ఉన్న సెల్ నంబరు తనది కాదన్న విషయం విచారణలో తేలిందని చెప్పారు. అలాగే తనను చూపిన టీవీ ఛానెల్స్ పైనా, తన పేరు వెల్లడి చేసిన పోలీసులుపైనా కేసు వేస్తానని అంది. అలాగే ఆధారాలు లేకుండా పోలీసులు ఎలా ఆ ఛానెల్ కు చెప్పుతారని ఆమె ప్రశ్నిస్తోంది. కేసు పెట్టే విషయమై తన లాయిర్ ని సంప్రదించానని ఆమె మీడియాకు తెలియచేసారు. అలాగే తను డ్రగ్స్ తీసుకుంటున్నానని ఒక్క ప్రూఫ్ అయినా చూపగలరా అని పోలీసులకు సవాల్ విసురుతోంది. ప్రస్తుతం త్రిష..కమల్ హాసన్ తో కలిసి మన్మధన్ అంబు అనే చిత్రంలో చేస్తోంది.


Click it and Unblock the Notifications











