‘బిజినెస్‌మేన్’ తమిళ వెర్షన్ కి ఆ దర్శకుడు
మహేష్ బాబు తాజా చిత్రం 'బిజినెస్‌మేన్"తమిళ,తెలుగులలో ఒకే రోజు విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. దాంతో విడుదల టైమ్ దగ్గరపడుతూండటంతో తమిళ డబ్బింగ్ వెర్షన్ ని ఓ ప్రక్క చాలా స్పీడుగా రెడీ చేస్తున్నారు. అందుకోసం ఓ తెలుగు దర్సక,రచయిత ఇందుకు సాయిం చేస్తున్నాడని విశ్వసనీయ సమాచారం. అయితే అతను దర్శకుడు క్రిష్ అయ్యి ఉండవచ్చునని చెప్పుకుంటున్నారు. వేదం చిత్రాన్ని తమిళంలోకి రీమేక్ చేసిన అనుభవంతో ఈ ప్రాజెక్టు భారాన్ని తనపై ఎత్తుకున్నాడని అంటున్నారు. అందులోనూ ఈ మధ్య క్రిష్ ప్రాజెక్టుకు మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం కూడా ఈ వార్తకు బలాన్ని కూరుస్తోంది. ఇక తెలుగు వెర్షన్ కి కథ,స్క్రీన్ ప్లే, మాటలను పూరీనే అందిస్తున్నారు.
పోకిరి తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రంపై ఉండే అంచనాలను దృష్టిలో పెట్టుకుని ఈ స్క్రిప్టుని పూరీ రచించటం జరిగింది. ఇక మహేష్ కి తెలుగు సహా తమిళ్‌లోనూ భారీ మార్కెట్ ఉంది. ముఖ్యంగా చెన్నైలో అతని వీరాభిమానులు ఉన్నారు. ఈ క్రేజిని దృష్టిలో ఉంచుకుని..తెలుగుతో పాటు తమిళ్‌లోనూ జనవరి 11న సినిమాని విడుదల చేస్తున్నారు. డిసెంబర్ 23న పాటలు మార్కెట్లోకి వస్తాయి. ప్రస్తుతం సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. పాటల చిత్రీకరణ నిమిత్తం ధాయలాండ్,బ్యాంకాక్ లో మహేష్,పూరి బిజీగా ఉన్నారు. ఈ చిత్రాన్ని ఆర్.ఆర్.మూవీమేకర్స్ పతాకంపై డావెంకట్ నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











