అదంతా దర్శకుడు చేసిన మాయ...: సమంతా..!?
చెన్నయ్ అందం సమంతా ఈ వేళ హీరోయిన్ గా ఈ స్థాయిలో వుందంటే... దానికి కారణం 'ఏ మాయ చేసావే' సినిమా అన్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే, ఆమె మాత్రం ఆమాటంటే ఒప్పుకోదు. ఇదంతా 'గౌతమ్ చేసిన మాయ' అంటుంది తను! అవును... ఆమెను కదిపితే చాలు... దర్శకుడు గౌతమ్ మీనన్ ని పొగడ్తలతో ముంచెత్తుతుంది.
ఇప్పుడు మళ్లీ గౌతమ్ డైరెక్షన్లో 'నీతానే ఎన్ పున్ వసంతం' అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా తమిళ, తెలుగు, మలయాళ భాషల్లో రూపొందుతోంది. దాంతో మళ్లీ గౌతమ్ ని ఆకాశానికి ఎత్తేస్తూ పొగడడం మొదలెట్టింది. 'గౌతమ్ చాలా కూల్ గా వుంటారు. మనం ఎన్ని టేకులు తీసుకున్నా కూడా ఆయన అసలు చికాకు పడరు. నన్ను టాలీవుడ్ కి పరిచయం చేసిన గౌతమ్, ఈ సినిమాతో మల్లూఉడ్ కి కూడా ఇంట్రడ్యుస్ చేస్తున్నారు. అక్కడ కూడా నాకు పేరు రావడం ఖాయం. ఎందుకంటే, ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నది గౌతమ్ కదా?" అంటూ గర్వంగా చెబుతోంది సమంతా.
గౌతమ్ మీనన్న మూడు బాషల్లో ముగ్గరు హీరోలు, అయితే మూడు బాషల్లో హీరోయిన్ సమంతనే ఎన్నుకోవడంలో ఆమెకు ఎంత క్రేజ్ ఉందో అర్థం అవుతుంది.


Click it and Unblock the Notifications











