రజనీకాంత్ దర్బార్ ఫస్ట్ లుక్ కాపీనా.. హాలీవుడ్ సినిమాతో పోలిక!

సూపర్ స్టార్ రజనీకాంత్ కొత్త చిత్రం ప్రారంభమైంది. స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో రజనీకాంత్ నటిస్తున్న దర్భార్ చిత్రాన్ని ఇటీవల ప్రారంభించారు. ముంబైలో ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ జరుగుతోంది. షూటింగ్ ప్రారంభించిన రోజే దర్బార్ ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. రజనీకాంత్ పోలీస్ అధికారిగా నటిస్తున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ అభిమానులని విశేషంగా ఆకట్టుకుంది. కాగా అప్పుడే దర్భార్ ఫస్ట్ లుక్ పై కాపీ అంటూ విమర్శలు మొదలైపోయాయి.

పోలీస్ గెటప్

పోలీస్ గెటప్

రజనీకాంత్ పోలీస్ గెటప్ లో ఉన్న పోస్టర్ ని విడుదల చేశారు. ఎప్పటిలాగే రజని దర్భార్ ఫస్ట్ లుక్ లో స్టైలిష్ గా కనిపిస్తున్నారు. రజనీకాంత్ గాగుల్స్ ధరించి కనిపిస్తున్నాడు. అతడి ముఖం చుట్టూ పోలీస్ కు ఉండాల్సిన సెటప్ మొత్తం ఉంది. ఖాకీ డ్రెస్, తుపాకులు, బెల్ట్, పోలీస్ డాగ్, బేడీలు ఇలా పోస్టర్ ని ఆకట్టుకునే డిజైన్ చేశారు. కానీ ఈ పోస్టర్ కాపీ అంటూ విమర్శలు వస్తున్నాయి.

హాలీవుడ్ చిత్రంతో పోలిక

హాలీవుడ్ చిత్రంతో పోలిక

హాలీవుడ్ ప్రముఖ నటుడు ఆర్నాల్డ్ నటించిన 'కిల్లింగ్ గంథర్' చిత్రంతో దర్బార్ ఫస్ట్ లుక్ ని పోలుస్తున్నారు. కిల్లింగ్ గంథర్ పోస్టర్ లో ఆర్నాల్డ్ ధరించిన గాగుల్స్, దర్భార్ లో రజని గాగుల్స్ ఒకేలా ఉన్నాయి. ఈ రెండు పోస్టర్స్ మధ్య దగ్గర పోలికలు కనిపిస్తున్నాయి. దీనితో దర్భార్ పోస్టర్ ని ఈ చిత్రం నుంచే కాపీ కాపీ చేశారంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది.

నిజాయతీతో డిజైన్ చేశాం

నిజాయతీతో డిజైన్ చేశాం

దర్బార్ పోస్టర్ కాపీ అంటూ వస్తున్న విమర్శలపై విన్సి రాజ్ స్పందించారు. ఆయనే దర్బార్ ఫస్ట్ లుక్ ని డిజైన్ చేశారు. విన్సి రాజ్ మాట్లాడుతూ. దర్బార్ ఫస్ట్ లుక్ కాపీ అంటూ వస్తున్న వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదు. రజని ఫస్ట్ లుక్ ని చాలా నిజాయతీతో డిజైన్ చేశాం. దర్బార్ ఫస్ట్ లుక్ కు మరే చిత్రంతో సంబంధం లేదు. రజనీకాంత్ సినిమాకు మూడవసారి పనిచేస్తున్నా. రజని చిత్రానికి నా బెస్ట్ అవుట్ పుట్ అందించాలనే తాపత్రయం తనది అని విన్సి రాజ్ తెలిపారు.

కొంతమంది అలా చేస్తున్నారు

కొంతమంది అలా చేస్తున్నారు

కాపీ ఆరోపణలు వచ్చిన తర్వాత తొలిసారి కిల్లింగ్ గంథర్ పోస్టర్ చూశా. నాకు ఎక్కడా పోలిక కనిపించలేదు. కానీ కొంతమంది సోషల్ మీడియాలో దర్భార్ పోస్టర్ ని ఎడిట్ చేసి కిల్లింగ్ గంథర్ పోస్టర్ తో దగ్గర పోలికలు ఉండేలా చేస్తున్నారు. కలర్ మార్చుతూ కాపీ ఫీలింగ్ వచ్చేలా చేస్తున్నారు. ఇది సరైనది కాదు అని విన్సి రాజ్ అభిప్రాయ పడ్డారు. రజనీకాంత్ ఈ చిత్రంలో డ్యూయెల్ రోల్ లో నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఓ పాత్రలో పోలీస్ అధికారిగా కనిపిస్తారు. రజనీ సరసన నయనతార హీరోయినిగా నటిస్తోంది. 2.0 చిత్రాన్ని నిర్మించిన లైకా ప్రొడక్షన్స్ సంస్థే ఈ చిత్రాన్ని కూడా నిర్మిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X