The Family Man 2 రిలీజ్ దాకా ఆగండి.. ట్రైలర్ చూసి అపోహలొద్దు.. నిషేధంపై రాజ్ అండ్ డీకే
అత్యంత ప్రేక్షకాదరణ పొందిన ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ విడుదలకు ముందే వివాదంలో చిక్కుకొన్నది. ఇటీవల రిలీజైన టీజర్ తమిళ ప్రజల ఆత్మగౌరవ పోరాటాన్ని కించపరిచేలా ఉందంటూ తమిళనాడులో పలు రాజకీయ పార్టీలు, పలు సంఘాలు నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి. తాజాగా ఈ వెబ్ సిరీస్‌పై తమిళనాడు ప్రభుత్వం కన్నెర్ర చేసింది. ఈ క్రమంలో సినిమా యూనిట్ ఓ ప్రకటనను విడుదల చేసింది. ఆ వివాదానికి కారణం ఏమిటంటే...
Recommended Video

సమంత పాత్ర ద్వారా చెప్పించిన డైలాగ్స్
ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్‌లో సమంత అక్కినేనిని తమిళ టెర్రరిస్టుగా చూపించారు. ఆ పాత్ర ద్వారా చెప్పించిన డైలాగ్స్, హావభావాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళుల జీవన విధానం, ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా ఉంది. వెబ్‌సిరీస్ ద్వారా ఇలాంటి తప్పుడు ప్రచారం చేయడం సరికాదు అని తమిళ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది.

తమిళ ఈలం కోసం ప్రాణ త్యాగాలు అంటూ
కొన్ని దశాబ్దాలుగా ఎన్నో వేల మంది ప్రత్యేక తమిళ ఈలం కోసం ప్రాణాలర్పించారు. స్వేచ్చ, న్యాయం, శాంతి, ఆత్మగౌరవం కోసం చేసిన పోరాటాన్ని కించపరిచేలా ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ ఉంది. తమిళ ప్రజల మనోభావాలను దెబ్బ తీసే వెబ్ సిరీస్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ప్రసారం చేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర సమాచార ప్రసార శాఖా మంత్రి ప్రకాశ్ జవదేకర్‌కు తమిళనాడు ప్రభుత్వం లేఖ రాసింది.

ట్రైలర్ చూసి తప్పుగా అర్ధం చేసుకోవద్దు..
తమిళనాడు ప్రభుత్వం రాసిన లేఖపై చిత్ర దర్శకులు ఓ ప్రకటనను విడుదల చేసి వివరణ ఇచ్చేందుకు ప్రయత్నం చేశారు. ది ఫ్యామిలీ 2 ట్రైలర్‌లోని కొన్ని సన్నివేశాల ఆధారంగా కొన్ని ఊహగానాలు, ఉద్దేశాలను ఏర్పరుచుకొన్నారు. ఈ వెబ్ సిరీస్‌కు పనిచేసిన లీడ్ యాక్టర్లు, క్రియేటివ్ టీమ్ సభ్యుల్లో ఎక్కువ మంది తమిళులే. మాకు తమిళ ప్రజలు, వారి సంస్కృతి అంటే విశేషమైన గౌరవం ఉంది అని దర్శక ద్వయం రాజ్ అండ్ డీకే తమ ప్రకటనలో స్పష్టం చేశారు.

సీజన్ 2 కోసం చాలా కష్టపడి
ప్రేక్షకులకు చక్కటి అనుభూతిని పంచేందుకు ఎన్నో ఏళ్లుగా శ్రమించాం. ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి ఈ వెబ్ సిరిస్ రూపొందించాం. ఈవ వెబ్ సిరీస్‌ను బ్యాలెన్స్‌గా, సెన్సిటివ్ అంశాలను కలబోసి అందించబోతున్నాం. ది ఫ్యామిలీ మ్యాన్ 1 సీజన్ ఏ విధంగానైతే ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచిందో సీజన్ 2 కూడా అలాంటి ఫీలింగ్‌ను కల్పిస్తుంది అని ది ఫ్యామిలీ మ్యాన్ దర్శకులు తమ వివరణను ఇచ్చారు.
రిలీజ్ అయ్యేంత వరకు ఆగండి
ది ఫ్యామిలీ మ్యాన్ 2 సీజన్ రిలీజ్ అయ్యేంత వరకు కొంచెం ఓపికతో ఆగండి. ఆ తర్వాత ఆ షోలో ఉన్న కంటెంట్‌ను మీరు ప్రశంసించకుండా ఉండలేరు అనేది మా విశ్వాసం అని దర్శకులు రాజ్ అండ్ డీకే తెలిపారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో జూన్ 4వ తేదీన ది ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











