The Kashmir Files TRP: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సినిమా.. టీవీలో మాత్రం దారుణంగా..
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి కలెక్షన్స్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అనుపమ్ ఖేర్ ప్రధాన పాత్రలో వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో తెరపైకి వచ్చిన ఈ సినిమాను అభిషేక్ అగర్వాల్ జీ స్టూడియోస్ తో కలిసి సంయుక్తంగా నిర్మించారు. ఇక సినిమాకు జనాల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. హిందీలో విడుదల అయినప్పటికీ దాదాపు అన్ని భాషల వారు సినిమా చూసేందుకు ఇష్టపడ్డారు.
ఇక సినిమా బాక్సాఫీస్ వద్ద పెట్టిన పెట్టుబడికి ఊహించని స్థాయిలో లాభాలను అంధించింది. సినిమా బడ్జెట్ 15 కోట్లు కాగా బాక్సాఫీస్ వద్ద మాత్రం 340 కోట్లు రాబట్టింది. నిర్మాతలకు ఈ ఒక్క సినిమాతోనే జాక్ పాట్ కొట్టేశారు. అయితే బుల్లితెరపై మాత్రం సినిమా అందుకు భిన్నమైన రెస్పాన్స్ అందుకోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. తెలుగులో ది కాశ్మీర్ ఫైల్స్ తెలుగులో ఇటీవల ప్రసరమైన ప్రీమియర్స్ కు ఒక ఫ్లాప్ సినిమా కంటే తక్కువ రేటింగ్స్ వచ్చాయి.

జీ తెలుగులో మొదటిసారి ప్రదర్సించగా చాలా దారుణంగా 1.35 TRP రేటింగ్ మాత్రమే రావడం ఆశ్చర్యం కలిగించింది. ఈ తరహా రెటీగ్స్ వస్తాయని ఎవరు ఊహించలేదు. బాక్సాఫీస్ వద్ద ఎన్నో రికార్డులను క్రియేట్ చేసిన ది.కాశ్మీర్ ఫైల్స్ బుల్లితెరపై కూడా సంచలన రేటింగ్స్ అండికుంటుంది అని అందరు అనుకున్నారు. కానీ అందుకు భిన్నమైన రెస్పాన్స్ అందుకోవడం ఆశ్చర్యమే.
ఇక మరో సినిమా బీస్ట్ కూడా ఫస్ట్ టైమ్ టీఆర్పీ రేటింగ్ తక్కువగానే రావడం ఆశ్చర్యాన్ని కలిగించింది. విజయ్ మాస్టర్ సినిమాతో తెలుగులో మంచి రెస్పాన్స్ అందుకున్నాడు. ఇక బీస్ట్ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక జెమిని టీవీలో ప్రీమియర్స్ కు 5.94 టీఆర్పీ రేటింగ్ వచ్చింది.


Click it and Unblock the Notifications











