'దమ్ము'కి ఫర్మిషన్ ఇవ్వమని తేల్చి చెప్పారు
తెలుగు ఫిల్మ్ మేకర్స్ కి జంతువులు,పక్షులు పెద్ద తలనొప్పిగా మారాయి. తాజాగా దమ్ము చిత్రం ఈ తలనొప్పిని ఎదుర్కొంటోంది. ఏనిమల్ వెల్పేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా చాలా కఠినమైన నిబంధలతో వారిని ఇబ్బందిపెడుతున్నారని వాపోతున్నారు. తాజాగా మార్చి 22న దమ్ము నిర్మాతలకు ఏనిమల్ బోర్డ్ నుంచి సమస్య ఎదరైంది. ఎన్టీఆర్,త్రిష,కార్తీక కాంబినేషన్ లో బోయపాటి శ్రీను డైరక్ట్ చేస్తున్న ఈ చిత్రం కోసం పావురాలని,గుర్రాలని తమ షూటింగ్ కి ఉపయోగించుకోవటానికి పెట్టుకున్న పర్మిషన్ కాన్సిల్ అయింది.
ఈ విషయమై భారతీయ ప్రాణమిత్ర సంఘం ఛీప్ ఎగ్జిక్యూటివ్ మహేష్ అగర్వాల్ మాట్లాడుతూ...మేము జంతువులతో షూటింగ్ కి పర్మిషన్ ఇవ్వలేదు. మేము చాలా షూటింగ్ లలో జంతువులు ఫెరఫార్మ్ చేస్తూ మరణించటం చూసాం. అఫీషియల్స్ ఎప్పుడో కానీ ఆ షూటింగ్ స్పాట్ ని ఇన్సెపెక్ట్ చేయటం లేదు. పిల్మ్ మేకర్స్ చాలా సార్లు పనిష్మెంట్ లేకుండా తప్పించుకుంటున్నారు అన్నారు.
ఇక దమ్ము చిత్రం ఏనిమల్ ఫర్మిషన్ గురించి చెపుతూ..ఈ చిత్రంలో ఫైట్ సీక్వెన్స్ బ్యాక్ గ్రౌండ్ లో పావురాలు కోసం పర్మిషన్ అడిగారు ఇవ్వలేదు. అలాగే నాలుగు గుర్రాలు కూడా దమ్ము చిత్రం కోసం ఫర్మిషన్ కోరారు. అయితే ఆ గుర్రాలని దమ్ము చిత్రం నిర్మించే కంపెనీ ఎలా చెన్నై నుంచి హైదరాబాద్ తీసుకుని వెళ్తారో చెప్పలేదు కాబట్టి నిరాకరించాం అన్నారు.
ఇక దమ్ము చిత్రానికే కాక శేఖర్ కమ్ముల లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్,బి జయ ..లవ్ లీ, తిమ్మరాజు చిత్రాల్లో కుక్కలను ఫర్మిషన్ లేకుండా వాడినందుకు నోటీసులు ఇష్యూ చేసామన్నారు. ఇక దమ్ము చిత్రం ఎన్టీఆర్,త్రిష కాంబినేషన్ లో బోయపాటి శ్రీను డైరక్ట్ చేస్తున్నారు. పక్కా మాస్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రూపొందుతోంది.


Click it and Unblock the Notifications











