సూపర్ డీలక్స్‌పై The New york Times రివ్యూ.. చీటింగ్ భార్యగా సమంత చించేసింది!
సమంత అక్కినేని వరుస విజయాలతో దూసుకెళ్తూ దక్షిణాది చిత్ర పరిశ్రమలో అగ్రహీరోయిన్‌గా మారారు. గతేడాది ఆమె నటించిన రంగస్థలం, అభిమన్యుడు, మహానటి చిత్రాలు బ్లాక్‌బస్టర్లుగా మారాయి. తాజాగా ఆమె నటించిన సూపర్ డీలక్స్ మార్చి 29న రిలీజ్ అయింది. ఈ చిత్రం గురించి అమెరికాలోని న్యూయార్క్ టైమ్స్ రివ్యూ ప్రచురించడం గమనార్హం. వివరాల్లోకి వెళితే..

సూపర్ డీలక్స్ మూవీ కథ
సూపర్ డీలక్స్ మూడు రకాల కథనాలతో సాగే కథ. ట్రాన్స్‌జెండర్‌గా మారిన శిల్ప (విజయ్ సేతుపతి) కుటుంబానికి చెందిన ఓ కథ. అలాగే మృతదేహాన్ని దాచిపెట్టేందుకు చేసే వెంబు (సమంత), ముగిల్ (ఫాహద్ పాజిల్) ప్రయత్నాలు. చీటింగ్ చేసే భార్యగా సమంత చక్కగా ఒదిగిపోయింది. ఈ చిత్రం ద్వారా ఆమె నటన మరోసారి హైలెట్ అయింది. మరో ముగ్గురు యువకులకు సంబంధించిన విషయాలు కథగా సాగుతుంటాయి.

పోర్న్‌స్టార్‌గా రమ్యకృష్ణ
సూపర్ డీలక్స్ సినిమాలో పోర్న్ స్టార్‌గా రమ్యకృష్ణ, మరో కీలకమైన పాత్రలో దర్శకుడు మిస్కిన్ నటనపై సినీ విమర్శకులు ప్రశంసలు కురిపించారు. ఈ చిత్రానికి త్యాగరాజన్ కుమార్ రాజా దర్శకత్వం వహించారు. మిస్కిన్, కుమారరాజా తదితరులు ఈ కథ, కథనాలపై కసరత్తు చేయడం విశేషం.

దర్శకుడిపై న్యూయార్క్ టైమ్స్ రివ్యూ
దర్శకుడు త్యాగరాజన్ కుమారరాజ కథను నడిపించిన విధానంపై న్యూయార్క్ టైమ్స్ ప్రశంసలు కురిపించింది. రకరకాల వేరియేషన్స్ ఉన్న పాత్రలతో కథను బలంగా రూపొందించారు. కథనంలో వేగం ఆకట్టుకొనేలా ఉంది. విజయ్ సేతుపతి, రమ్యకృష్ణ, మిస్కిన్, సమంత, ఫాహిద్ పాత్రలను తీర్చిదిద్దిన విధానం బాగుంది అని న్యూయార్క్ టైమ్స్ కామెంట్స్ చేసింది.

బోల్డ్‌గా, బ్యూటిఫుల్‌గా
ఇండియన్ సినిమాల్లో సెక్స్ గురించి ప్రస్తావించడానికి వెనుకాడుతారు. కానీ ఈ చిత్రంలో నిజాయితీగా, బోల్డ్‌గా కథను చెప్పడం పాజిటివ్ పాయింట్. చక్కటి నేటివిటి, సాంకేతిక విలువలతో తెరకెక్కిన చిత్రం అని న్యూయార్క్ టైమ్స్ తన రివ్యూలో వెల్లడించింది.


Click it and Unblock the Notifications











