సూపర్ స్టార్ కోసం పద్మ విభూషన్ వెయిట్ చేస్తోంది...!
సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ కు త్వరలోనే పద్మవిభూషణ్ అవార్డు వరించనున్నట్లు సమాచారం.దక్షిణాదిలోనే కాకుండా విదేశాల్లోనూ ఆయనకు పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు.ఈ సుప్రసిద్ధ నటుడి ని త్వరలోనే పద్మవిభూషణ్ అవార్డు వరించనుందని ప్రచారం సాగుతోంది.
తమిళం, హిందీల్లో పలు చిత్రాలను నిర్మించిన సీనియర్ నిర్మాత ఎస్.రామనాథన్ రజనీకాంత్ తో గిరఫీ...తార, ముంబాయ్ టూ గోవా, మాహాన్ వంటి చిత్రాలను నిర్మించారు. ఇటీవలి ఆయన మాట్లాడుతూ రజనీకాంత్ కోసం పద్మవిభూషణ్ అవార్డు వేచి ఉందని పేర్కొన్నారు. రజనీ మంచి నటుడే కాకుండా మానవతావాది అని చెప్పారు.
ఆయన నిరాడంబరత అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు.సేవాభావం గల రజనీకాంత్ కు త్వరలోనే పద్మవిభూషణ పురస్కారం దక్కుతుందన్నారు. కాగా ఈ నెల 12న సూపర్ స్టార్ పుట్టిన రోజు సందర్భంగా రజనీకాంత్ మైనపు బొమ్మ ఏర్పాటు చేసేందుకు అభిమానులు సన్నద్ధం అయినట్లు తెలుస్తోంది. రజనీ తాజా చిత్రం కొచ్చడయ్యాన్ త్వరలో షూటింగ్ జరుపుకోనుంది.


Click it and Unblock the Notifications











