ధనుష్‌పై క్రిమినల్ కేసు.. ఆ తప్పు చేశాడా, తండ్రి ఆవేదన!
Recommended Video

హీరో ధనుష్ ని ఓ కేసు నీడలా వెంటాడుతోంది. మధురైకు చెందిన దంపతులు హీరో ధనుష్ తమ కుమారుడే అంటూ గత ఏడాది నుంచి చట్టపరంగా పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. ధనుష్ చిన్న వయసులో ఇంటినుంచి పారిపోయాడని ఆ తరువాత హీరోగా మారాడని మధురై జిల్లాకు చెందిన కదిరేశన్ దంపతులు పేర్కొంటున్నారు. గత ఏడాది నుంచి ఈ కేసు కోర్టులో కొనసాగుతూనే ఉంది. తాజగా ఈ కేసు మరో మలుపు తిరిగింది.

మేలూరులో మొదలై
తాము ధనుష్ తల్లిదండ్రులం అని చెప్పుకుంటున్న కదిరేశన్, మీనాక్షి దంపతులు మధురై జిల్లా మేలూరుకు చెందినవారు. ధనుష్ తమ కొడుకే అంటూ వీరిద్దరూ మొదట మేలూరు కోర్టులో ఫిర్యాదు చేశారు. ఆ తరువాత కేసు మద్రాస్ హైకోర్టు వరకు వచ్చింది.

ప్రతి నెల డబ్బు
ధనుష్ తమ కుమారుడే కాబట్టి ప్రతి నెల తమకు కొంత డబ్బు అందేలా కోర్టు చర్యలు తీసుకోవాలని కదిరేశన్ దంపతులు కోర్టుముందు వేడుకున్నారు. చాలా రోజులపాటు కేసు విచారణ జరిగింది. బర్త్, ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్ చూపించాలని ధనుష్ ని కోర్టు ఆదేశించింది. ధనుష్ తన సర్టిఫికెట్స్ చూపించడంతో కోర్టు కేసుని కొట్టివేసింది.

కిమినల్ కేసు
తాజాగా కదిరేశన్ దంపతులు ధనుష్ పై కిమినల్ కేసు నమోదు చేయాలని కోర్టుని ఆశ్రయించారు. ధనుష్ చూపించినవి నకిలీ పాత్రలు అని ఆరోపిస్తున్నారు. న్యాయ స్థానం తాజగా కదిరేశన్ కేసుని స్వీకరించడం సంచలనంగా మారింది. నవంబర్ 9న ఈ కేసు విచారణకు రానుంది. ధనుష్ కోర్టుమెట్లు ఎక్కే పరిస్థితి వస్తుందా లేక అతడి న్యాయవాదులు డీల్ చేస్తారా అనేది వేచి చూడాలి.

సూపర్ స్టార్ అల్లుడిగా
ధనుష్ నటుడిగా మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. విభిన్నమైన చిత్రాలకు ధనుష్ పెట్టింది పేరు. సూపర్ స్టార్ రజని అల్లుడు కూడా కావడంతో ధనుష్ కు మరింత పాపులారిటీ పెరిగింది. ప్రస్తుతం ధనుష్ పలు చిత్రల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు.


Click it and Unblock the Notifications











