For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రజనీ కు ప్రామిస్ చేసా, అందుకే 'రోబో 2' వదలుకున్నా

  By Srikanya
  |

  హైదరాబాద్: కమల్ హాసన్ కు, తమిళ దర్శకుడు శంకర్ కు మంచి రాపో ఉంది. దాంతో అందరూ అప్పట్లో కమల్ హాసన్ విలన్ గా..రజనీ హీరోగా రోబో 2 తెరకెక్కుతుందని అంచనా వేసారు. అంతేకాదు ఆ మేరకు కమల్ ని అడిగినట్లు వార్తలు వచ్చాయి. అయితే అవి రూమర్స్ అని అంతా కొట్టి పారేసారు. కానీ అవి రూమర్స్ కాదు నిజమే అంటున్నారు కమల్.

  కాకపోతే కమల్ తాను రోబో 2 చిత్రంలో పాలుపంచుకోలేకపోవటానికి కారణం కేవలం రజనీకాంత్ కు ఇచ్చిన ప్రామిస్ అని చెప్తున్నారు. మొదట కమల్, ప్రీతి జింతా మీదే రోబో చిత్రానికి సంభందించిన ఫొటో షూట్ జరిగింది. అయితే అది మెటీరియలైజ్ కాలేదు. కానీ తర్వాత ఆయన్ను రోబో 2 లో కమల్ ని విలన్ గా చేయమని శంకర్ సంప్రదించారు.

  కానీ కమల్ నో చెప్పారు. దాంతో అక్షయ్ కుమార్ సీన్ లో కు వచ్చారు. దాంతో అందరూ కమల్ కు ఈ వయస్సులో నెగిటివ్ పాత్రలో కనిపించటం ఇష్టం లేక వదులుకున్నాడని అన్నారు. అలాగే వార్తలు సైతం వచ్చాయి. కానీ నోరు విప్పి నిజమేంటో చెప్పలేదు. కానీ షూటింగ్ మొదలైన ఇంతకాలానికి ఆయన అసలు నిజం ఏమిటో బయిటపెట్టారు.

  కమల్ ఏమన్నారంటే..తనను శంకర్ కలిసి, విలన్ గా చేయటం నిజమే అని, అయితే తాను వద్దనుకోవటానికి మాత్రం కారణం వేరే ఉందని అన్నారు. అది తను తన స్నేహితుడు అయిన రజనీకాంత్ కు చాలా కాలం క్రితం ఇచ్చిన మాటే అని చెప్తున్నారు.

  వాళ్లిద్దరకూ కలిసి గతంలో కొన్ని సినిమాలు కలిపి చేసారు. అయితే తర్వాత ఎవరికి వేరే హీరోలుగా చేస్తున్నప్పుడు ఒక మాట అనుకున్నారట. ఇద్దరూ కలిసి ఈ సారి సినిమా చేస్తే ఈ సారి.. ఇద్దరూ కానీ ఇద్దరిలో ఒకరైనా ఆ సినిమాని ప్రొడ్యూస్ చేస్తేనే కలిసి చెయ్యాలనుకున్నారట. ఆ మాట ప్రకారం కమల్..వేరే నిర్మాత కాబట్టి తాను ఈ సినిమాలో విలన్ గా చేయలేకపోయానని అన్నారు.

  కమల్ ఒకసారి రిజెక్ట్ చేసాక దర్శకుడు శంకర్... ఆ పాత్ర కోసం అమీర్ ఖాన్, విక్రమ్, ఆర్నాల్డ్ వంటి స్టార్స్ ని అడిగారు. తర్వాత మరో స్టార్ అక్షయ్ కుమార్ ఈ సినిమాలో విలన్ గా చేయటానికి ఒప్పుకోవటంతో ఫైనల్ చేసారు.

  స్లైడ్ షోలో మిగతా విశేషాలు..

   కెరీర్ ప్రారంభంలోనే...

  కెరీర్ ప్రారంభంలోనే...

  కమల్ హీరోగా నటించిన అనేక చిత్రాల్లో రజనీకాంత్ విలన్ గా నటించాడు.

  ఇదొక కారణం కూడా

  ఇదొక కారణం కూడా

  'రజనీ చిత్రంలో కమల్ విలన్' అనే మాటను ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. ఫేస్ బుక్, ట్విట్టర్ లలో ఈ విషయమై చర్చకు తెరతీసారు. ఫ్యాన్స్ మనోగతాన్ని గుర్తించిన కమల్ కూడా ఎక్కువ డామేజ్ జరగకముందే ఆగిపోయారు.

  ఇదే చివరి

  ఇదే చివరి

  రజనీకాంత్, కమల్ హాసన్ కలిసి నటించిన చివరి సినిమా 'అందమైన అనుభవం'. ఆ సినిమా విడుదలై 36 ఏళ్ళు గడిచిపోయింది.

  పంక్షన్స్ లోనే

  పంక్షన్స్ లోనే  గురువు బాలచందర్ కు సంబంధించిన సినిమాల వేడుకల్లోనో, చిత్రసీమకు సంబంధించిన కార్యక్రమాల్లోనో కలిసి కనిపించడం తప్పితే... సిల్వర్ స్క్రీన్ ను ఈ మూడున్నర దశాబ్దాల కాలంలో షేర్ చేసుకోలేదు.

  ఇదో రీజన్

  ఇదో రీజన్

  అందుకూ కమల్ ఓ జెన్యూన్ రీజన్ చెబుతున్నారు. తామిద్దరి రెమ్యూనరేషన్స్ ను తట్టుకునే నిర్మాతలు లేరని, ఒకరి మీద ఒకరికి అభిమానం ఉన్నా, రెమ్యూనరేషన్ విషయంలో ఇద్దరం రాజీ పడమని కమల్ స్పష్టం చేశాడు.

  క్రేజే వేరు

  క్రేజే వేరు

  అయితే వీరిద్దరినీ ఒకే సినిమాలో చూడాలని ఆశ పడుతున్న సినీ ప్రేక్షకులు కోకొల్లలు. వీరు కలిసి నటిస్తే వచ్చే క్రేజే వేరు అంటున్నారు.

  కనీసం గెస్ట్ గా అయినా

  కనీసం గెస్ట్ గా అయినా

  కనీసం ఒకరి సినిమాలో మరొకరు అతిథి పాత్రలో మెరిసినా చాలన్నది వారి కోరిక.

  అదీ కష్టమే

  అదీ కష్టమే


  గెస్ట్ గా కూడా చేయటం సాధ్యపడే అవకాశం లేదని, కమల్ చేతులెత్తేశాడు.

  రజనీ చెప్తే

  రజనీ చెప్తే

  కానీ రజనీకాంత్ డైరక్ట్ గా ఆయనే అడిగితే కమల్ చేసే అవకాసం ఉందంటున్నారు.

  అవకాసం లేదు

  అవకాసం లేదు

  కమల్, రజనీ కాంబినేషన్ అనే మాటను ఇక మర్చిపోవచ్చేమో అంటున్నార తమిళ సినీ జనం.

  English summary
  Kamal Hassan has now confirmed that the real reason behind his refusal had to do with a vow he had made many years ago, along with one of his best friends, superstar Rajinikanth. After Rajinikanth and Kamal Haasan decided to part ways (they have acted together in many movies before), they made a vow saying that if at all they decide to share screen space once again, it will be in a movie that is produced by either of the two.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X