twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సంచలనం సృష్టిస్తున్న‘కోలవెర డీ’ సాంగ్ వెనుక సీక్రెట్ ఏంటి...?

    By Sindhu
    |

    'వై దిస్ కొలవెరి కొలవెరి కొలవెరి డీ..." ఇదిప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న పాట. '3" సినిమా కోసం తమిళ హీరో ధనుష్ స్వయంగా పాడాడీ పాటని సరదాగా రాసుకుని పాడిన పాట ఇంత రేంజ్ లో హాల్ చల్ చేస్తుందని తాను అనుకోలేదని ధనుష్ పదే పదే చెబుతున్నాడు. 'కొలవెరి" పాట పాపులారిటీ గురించి నిత్యం మీడియాలో కథనాలు విన్పిస్తున్నాయి. ఆ కథనాలతో మరింగా 'కొలవెరి " పాటకి అభిమానులు పెరిగిపోతున్నారు 'కొలవెరి" పేరుతో ఇంటర్నెట్ లో వీడియో ఆల్బమ్స్ దర్శనమిస్తున్నాయి. తాజాగా విజయవాడలోని ప్రకాశం బ్యారేజీపై ఔత్సాహికులైన కుర్రకారు 'కొలవెరి" అల్బమ్ ని షూట్ చేసి ఇంటర్నెట్ కి వదిలేశారు.

    అదొక్కటే కాదు..నెట్ లో వందకు పైగా ఇలాంటి ఆల్బమ్స్ కొలవెర్రి పేరుతో హల్ చల్ చేస్తున్నాయి. 'ఏమిటీ పిచ్చి..అసలు ఆ పాటలో ఏముంది..?అపి కొందరంటోంటే. 'బ్రోకెన్ ఇంగ్లీష్ పేరుతో ఖూనీ చేశారు..." అని మరికొందరు విమర్శిస్తోంటే.. ఎక్కువమంది మాత్రం కొలవెరి" మేనియాలో మునిగితేలుతున్నారు. అందులోని రహస్యం ఏమిటంటే యూట్యూబులో ఈ పాట విన్న వారి సంఖ్య 74 లక్షల 40 వేల 928 మంది. (ఈ వార్త రాసే సమయానికి), ప్రతి గంటకు వ్యూయర్స్ సంఖ్య పెరుగుతోంది. అత్యధిక సైట్లలో లభిస్తున్న ప్రాంతీయ పాట ఇది. ముఖ్యంగా ఈ పాట అట్రాక్ట్ చేయడానికి కారం లిరిక్స్ చాలా సింపుల్ గా ఉండటం. ఈ పాటను ధనుష్ తన స్లాంగ్ లో పాడటం ఎక్కువగా శ్రోతలను ఆకర్షిస్తోంది. ఓ యూట్యూబ్ ఎక్స్ పర్ట్ ఏమన్నారంటే ఈ పాట ఓ 'చాక్లెట్ రైన్" ట్యూన్ వుందంటూ అభివర్ణించారు. ఈ పాట పాడింది, రాసింది ధనుష్. ఈ పాట రాయడానికి పట్టిన సమయం ఆరు నిమిషాలు.

    English summary
    The main attractive point in this song is its lyrics and the way the song has been sung by Dhanush and the attention grabbing slang. Some youtube experts are saying that it is similar to 'Chocolate Rain' that turned Tay Zonday into a celebrity, overnight.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X