twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిత్ర పరిశ్రమపై పోరాటం.. నష్టాలొస్తే నటులే భరించాలి.. థియేటర్ల సంఘం డిమాండ్

    |

    థియేటర్ల బంద్‌ల ప్రభావం సినీ పరిశ్రమ మొత్తానికి ఉంటుంది. సినిమాలు ఆడితేనే.. అందరూ బాగుండేది. థియేటర్లలో టికెట్లు తెగితేనే నిర్మాతల చేతుల్లోకి డబ్బులు వస్తాయి. కొన్ని వేల మందికి పని దొరుకుతుంది. ఎన్నో రోజులు, ఎంతో డబ్బు పెట్టి తీసిన సినిమాలు రిలీజ్ చేయడమే కష్టమవుతోంది. వీటికి తోడు ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ అంటూ వచ్చి ప్రేక్షకులను థియేటర్లకు రాకుండా చేస్తోంది. ఈ తరుణంలో వీటన్నంటికి పరిష్కారాల కోసం థియేటర్ల సంఘం బంద్‌కు దిగుతోంది. అయితే అది మన టాలీవుడ్‌లో కాదులేండి.

    పెరిగిన ఓటీటీ వాడకం..

    పెరిగిన ఓటీటీ వాడకం..

    ప్రస్తుతం ప్రేక్షకుల అభిరుచి మారుతోంది. థియేటర్లకు వచ్చి సినిమాను చూసేంత ఓపిక ఉండటం లేదు. అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ లాంటి వాటిల్లో కొత్త సినిమాలు వెను వెంటనే రావడం, అంతేకాకుండి సినిమాలను మించి వెబ్ సిరీస్‌లు ఆసక్తిని రేకెత్తించడం ఇలా ప్రతీ ఒక్కటీ ఆడియెన్స్‌ను థియేటర్లకు దూరం చేస్తోంది.

    కోలీవుడ్‌పై పోరాటం..

    కోలీవుడ్‌పై పోరాటం..

    తమిళనాట చలన చిత్ర పరిశ్రమపై థియేటర్ల సంఘం పోరాటం ప్రారంభించింది. తమ డిమాండ్లపై చిత్ర పరిశ్రమ దృష్టి సారించాలని లేకపోతే.. థియేటర్లను మూసివేస్తామని హెచ్చరించింది. ప్రస్తుతం చిత్ర పరిశ్రమ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోందని.. ఒకవైపు పైరసీ సమస్య, మరోవైపు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ తో సాధారణ ప్రేక్షకులు థియేటర్లవైపు కన్నెత్తి చూడటం లేదని తమిళనాడు థియేటర్స్ సంఘం పేర్కొంది. ఈ పరిస్థితుల్లో తాము థియేటర్లను ఏ విధంగా నడపాలో అర్థం కావడం లేదని ఆందోళన వ్యక్తం చేసింది.

    భారంగా వినోద పన్ను..

    భారంగా వినోద పన్ను..

    ఈ పరిస్థితుల్లో మార్పు లేకపోతే థియేటర్లు మూసుకోవాల్సి వస్తుందని థియేటర్స్ సంఘం చలన చిత్ర పరిశ్రమను హెచ్చరించింది. రాష్ట్ర ప్రభుత్వం సినిమాలపై విధిస్తున్న 8శాతం వినోద పన్నును రద్దు చేయాలని పేర్కొంది. లేదంటే తమకు నష్టాలు తప్పవని పేర్కొంది.

     నటీనటులే భరించాలి..

    నటీనటులే భరించాలి..

    పెద్ద చిత్రాల కారణంగా నష్టాలు వస్తే.. ఆ నష్టాన్ని చిత్ర నటీనటులే భరించాలని థియేటర్స్ సంఘం డిమాండ్ చేసింది. సినిమా విడుదలకు వంద రోజుల ముందు డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లో విడుదల చేయకూడదని కూడా సూచించింది. ఈ డిమాండ్లకు ఒప్పుకోవాలని లేకపోతే వచ్చే ఏడాది మార్చి 1 నుంచి థియేటర్లను నిరవధికంగా మూసివేస్తామని హెచ్చరించారు.

    English summary
    Theatres Assocuation About Entertainment Tax In Kollywood. They Demand That Entertainment Tax Should Be Reduced. And If Big projects Gets Loss Actors Should Be bare.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X