ఎలా రిలీజ్ చేస్తావో చూస్తామంటూ స్టార్ హీరోకి ధియోటర్ ఓనర్స్ వార్నింగ్
చిత్రం ప్లాపై తాము నష్టపోతే కాంపన్షేషన్ ఇవ్వకపోగా...అస్సలు చిన్న మాట కూడా తమ వైపు మాట్లాడని తమిళ హీరో విజయ్ పై అక్కడ ధియోటర్ యజమానులు మంటగా ఉన్నారు. తమన్నా కాంబినేషన్ లో చేసిన విజయ్ గత చిత్రం సూర పెద్ద ప్లాప్ కావటంతో అయినప్పుడు ఆ సినిమా రిలీజ్ చేసిన ధియోటర్ యజమానలంతా విజయ్ ని కలిసి కాంపన్షేషన్ అడిగారు. అయితే విజయ్ అస్సలు స్పందించలేదు. అప్పుడు వారు అతని సినిమాలు భవిష్యత్ లో విడుదల చేయమని వార్నింగ్ కూడా ఇచ్చారు. అయితే విజయ్ అస్సలు లెక్క చేయలేదు. తన అభిమానులే అంతా చూసుకుంటారని అన్నాడు. అప్పుడతనికి శరత్ కుమార్ సపోర్ట్ చేసాడు. ఇప్పుడు ధియోటర్ ఓనర్స్ అంతా రీసెంట్ గా మీటింగ్ పెట్టుకుని తాము ఆ రోజు అన్నమాటని సీరియస్ గా తీసుకుని అమలు పరిచాలని నిర్ణయించాలనుకున్నారు. విజయ్, ఆసిన్ కాంబినేషన్లో బాడీగార్డ్ రీమేక్ గా రూపొందించిన కావలన్ చిత్రంపై వారు బ్యాన్ పెట్టారు. ఈ చిత్రాన్ని ఎక్కడా విడదల కానివ్వకూడదని, అది అతిక్రమించి ఎవరైనా విడుదల చేస్తే సీరియస్ గా ఆ ధియోటర్ వారికి ఫనిష్మెంట్ ఉంటుందని, అలాగే ఆ ప్రింట్లను పట్టుకుని తగలపెట్టేస్తామని వార్నింగ్ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











