twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇవన్నీ అమ్మ అవార్డులే... జాతీయ అవార్డు మాత్రం అందుకోలేక పోయింది

    తన 32 ఏళ్ల సినీ కెరీర్‌లో జయలలిత పలు రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి అవార్డులను సైతం అందుకున్నారు.

    |

    నాట్యకళాకారిణిగా, నటిగా, తమిళనాడు ముఖ్యమంత్రిగా తమిళనాడు చరిత్రలో ఒక స్థానాన్ని దక్కించుకున్న జయలలిత తన కెరీర్‌ను నటిగా ప్రారంభించారు.స్టెల్లా మేరీస్‌ కళాశాలలో ప్రవేశం లభించిన తరుణంలోనే ఆమెకు నటించే అవకాశం దక్కింది. అలా 1961లో 'శ్రీశైల మహాత్మ్యా' అనే కన్నడ చిత్రం ద్వారా సినీరంగప్రవేశం చేశారు. ఆ తర్వాత శంకర్‌ వి.గిరి దర్శకత్వంలో 'ఎబిసిస్‌' అనే ఆంగ్ల సినిమాలో నటించారు. మళ్లీ అదే సంవత్సరంలోనే 'మేన్‌ మనుషి' అనే కన్నడ చిత్రంలో నటించారు.

    జయ తన నటన.. నృత్యం.. అభినయంతో తమిళ వెండి తెరపై బంగారు రాణిగా వెలుగొందారు. ఆమె అనతి కాలంలోనే ఆకాశమంత ఎత్తుకు ఎదిగిపోయారు. 1965 నుంచి 1977 వరకు దేశంలో అత్యధిక పారితోషికం అందుకున్న హీరోయిన్‌గా జయ రికార్డు సృష్టించారు. కేవలం తమిళమే కాకుండా తెలుగు, మలయాళం, హిందీ చిత్రాల్లోనూ ఈమె ప్రత్యేక ముద్ర వేశారు. కానీ చివరి రోజుల్లో అంటే 1980 ప్రాంతంలో ఈమెకు అవకాశాలు సన్నగిల్లాయి.. అయినా ఆమె లెక్క చేయలేదు. తర్వాత రాజకీయాల్లోకి వచ్చి రాణిగా వెలుగొందారు.

     తొలి సినిమాతోనే గుర్తింపు:

    తొలి సినిమాతోనే గుర్తింపు:

    1964లో జయలలిత నటించిన కన్నడ సినిమా 'సిన్నడా కొంబే' జయలలితకు విమర్శకుల నుంచి నటనాపరంగా మంచి పేరుతెచ్చిపెట్టింది. అనంతరం పలు కన్నడ చిత్రాల్లో నటించారు. 1965లో శ్రీధర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన 'వెన్నిరాడై' సినిమా ద్వారా తమిళ సినిమాలో అడుగుపెట్టే అవకాశం దక్కింది. తొలి సినిమాతోనే ఆమె గుర్తింపు తెచ్చుకున్నారు.

    తొలి హీరో మాత్రం అక్కినేని :

    తొలి హీరో మాత్రం అక్కినేని :

    తమిళ, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో నటించిన జయ.. దాదాపుగా అన్ని పరిశ్రమలో అగ్ర హీరోలందరితో నటించారు. అయితే, తెలుగులో జయ తొలి హీరో మాత్రం అక్కినేని నాగేశ్వరరావు. అక్కినేని హీరోగా 1965లో వచ్చిన ‘మనుషులు మమతలు' సినిమాలో 17 ఏళ్ల జయలలిత హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమా ఆ ఏడాది బెస్ట్ ఫీచర్ ఫిల్మ్‌గా జాతీయ అవార్డుకు ఎంపిక అయ్యింది.

     ఈ సినిమాతో పురచ్చి తలైవి:

    ఈ సినిమాతో పురచ్చి తలైవి:

    తదనంతరం 'పురచ్చి తలైవర్‌' ఎంజీఆర్‌ సరసన తొలిసారిగా 'ఆయిరత్తిల్‌ ఒరువన్‌' సినిమాలో నటించారు. ఈ సినిమాతో పురచ్చి తలైవి (విప్లవ నాయిక)గా ఆమె గుర్తింపు పొందారు. ఎంజీఆర్‌, జయలలిత జంటకు మంచి పేరు దక్కింది. ఆ వెంటనే జయశంకర్‌ సరసన 'నీ' సినిమాలో నటించారు. తన 32 ఏళ్ల సినీ కెరీర్‌లో జయలలిత పలు రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి అవార్డులను సైతం అందుకున్నారు.

    జాతీయ అవార్డు రాలేదు:

    జాతీయ అవార్డు రాలేదు:

    చంద్రోదయం (1966), అడిమై పెణ్ (1969), ఎంగిరుందో వందాళ్ (1970), పట్టికూడ పట్టణమా (1972), శ్రీకృష్ణ సత్య (1972), సూర్యగాంధి (1973) చిత్రాలకు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, మద్రాస్ ఫిల్మ్ ఫ్యాన్స్ అసోసియేషన్ నుంచి 7సార్లు ఉత్తమనటిగా, తమిళనాడు సినిమా ఫ్యాన్ సంస్థ నుంచి 8సార్లు ఉత్తమనటిగా అవార్డులు గెలుచుకున్నారు జయలలిత. ఉత్తమనటిగా జాతీయ అవార్డు సాధించనప్పటికీ, 1965లో అక్కినేని నాగేశ్వరరావు సరసన నటించిన ‘మనుషులు, మమతలు' చిత్రం జాతీయ తెలుగు బెస్ట్ ఫీచర్ ఫిల్మ్‌గా అవార్డు సాధించింది.

    అధికంగా ఎంజీఆర్‌తోనే:

    అధికంగా ఎంజీఆర్‌తోనే:

    జయలలిత తన కెరీర్‌లోనే అధికంగా ఎంజీఆర్‌తోనే కలసి నటించారు. వీరిద్దరి కాంబినేషన్‌లో 'తాయ్‌కు తలమై మగన్‌', 'కావల్‌కారన్‌', 'రగసియ పోలీస్‌', 'ఒళి విలక్కు', 'తేర్‌ తిరువిళా', 'కుడిఇరుంద కోవిల్‌', 'కన్నన్‌ ఎన్‌ కాదలన్‌', 'పుదియభూమి', 'నమ్‌ నాడు', 'ఎంగల్‌ తంగం', 'మాట్టుక్కార వేలన్‌',

    'నాంగ పుదుసా..' పాటతో:

    'నాంగ పుదుసా..' పాటతో:

    'కుమరికోట్టం' 'సవాలే సమాళి', 'రామన్‌ తేడియ సీదై', 'ఒరుతాయ్‌ మక్కల్‌' 'అన్నమిట్ట కై' వంటి పలు సినిమాలు వచ్చాయి. 'ఒళివిలక్కు' సినిమాలో 'నాంగ పుదుసా..' అంటూ పాటతో ఎంజీఆర్‌, జయలలితలు సంచారజాతి ప్రజలకు ఆత్మబంధువుగా మారారంటే అతిశయోక్తి కాదు. ఇప్పటికీ కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న సంచారజాతి ప్రజలు ఈ పాటకు చిందులేసే సన్నివేశాలు కనిపిస్తుంటాయి.

    English summary
    These are the Awards of former Indian actress Jayalalitha who has acted in over 140 films.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X