The GOAT యంగ్ విజయ్ పాత్ర చేసింది ఎవరో తెలుసా? లీక్ చేసిన వెంకట్ ప్రభు

ప్రస్తుతం ఇండియన్ సినిమా నుంచి పలు భారీ చిత్రాలు వస్తున్న సంగతి చూస్తూనే ఉన్నాం. ఇలా పలు సినిమాలు హై ఎండ్ టెక్నీకల్ వాల్యూస్ తో తెరకెక్కుతూ కొత్త కొత్త టెక్నాలజీ లను తీసుకొచ్చి ఆడియెన్స్ కి ట్రీట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా రెండు సినిమాలు ఓ పాన్ ఇండియా వైడ్ గా మంచి హాట్ టాపిక్ అయ్యాయి.

మరి ఆ చిత్రాలే రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన భారీ సినిమా "కల్కి 2898 ఎడి" కాగా మరో సినిమా కోలీవుడ్ హీరో విజయ్ దళపతి నటించిన "ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం". కాగా ఈ రెండు సినిమాల్లో ఒక టెక్నాలజీని మేకర్స్ కామన్ గా వినియోగించారు. మరి ఆ పాయింట్ ఏంటంటే.. ఈ రెండు సినిమాల్లో కూడా డీ ఏజింగ్ టెక్నాలజీని వాడారు.

this actor played vijay teenage version in the goat movie

అంటే ఒక వయసైన నటుడుని మళ్ళీ తన యంగ్ ఏజ్ లో ఎలా చూపించే ప్రయత్నం ఈ సినిమాల్లో చేశారు. అయితే ఇది ఎక్కువగా హాలీవుడ్ సినిమాల్లో వాడుతారు. కానీ ఇప్పుడు మన దగ్గర కూడా స్టార్ట్ చేసారు. కాగా కల్కి లో బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ కి వాడితే విజయ్ గోట్ సినిమాలో విజయ్ పైనే చేశారు. మరి ఈ సినిమాలో విజయ్ చాలా రకాల ఏజ్ గ్రూపులతో కనిపించాడు.

కాగా వీటిలో మిడిల్ ఏజ్ లో విజయ్ గా విజయ్ నే నటించాడు కానీ టీనేజ్ విజయ్ లుక్ లో కూడా తాను కనిపించాడు. అయితే ఈ విజయ్ లా కూడా హీరో విజయ్ నే నటించాడు అని చాలా మంది అనుకుంటున్నారు. కానీ ఇక్కడ అసలు విషయాన్ని దర్శకుడు బయట పెట్టాడు. కాగా టీన్ ఏజ్ లో విజయ్ దళపతి విజయ్ నటించలేదట. తన టీన్ ఏజ్ లో తనకి దగ్గర పోలికలు ఉండే ఓ కుర్రాడితో ఈ రోల్ ని చేయించారట.

this actor played vijay teenage version in the goat movie

విజయ్ టీనేజ్ లో ఉన్నపుడు తన స్కిన్ టోన్, హెయిర్ స్టయిల్ ని మ్యాచ్ చేసేలా ఉండే యువ నటుడు అయాజ్ ఖాన్ నటించాడు అని దర్శకుడు వెంకట్ ప్రభు రివీల్ చేయడం వైరల్ గా మారింది. దీనితో చిన్ననాటి విజయ్ గా నటించింది కూడా విజయ్ నే అనుకున్న వారికి దర్శకుడు ట్విస్ట్ ఇచ్చాడు అని చెప్పాలి. ఇక ఈ భారీ సినిమాలో హీరోయిన్స్ గా మీనాక్షి చౌదరి, స్నేహలు నటించగా స్టార్ బ్యూటీ త్రిష ఐటెం సాంగ్ లో మెరిసింది.

అలాగే వారితో పాటుగా ప్రభుదేవా, జైరాం, ప్రశాంత్ తదితరులు నటించారు. ఇక ఈ సినిమా ఇపుడు అనుకున్న రేంజ్ లో టాక్ ని తెచ్చుకోలేదు. దీనితో సినిమా వసూళ్లు ఇపుడు అంతంత మాత్రమే నమోదు అవుతున్నాయి. తెలుగులో కూడా ఈ సినిమాకి ఎక్కువ బిజినెస్ నే జరిగింది కానీ ప్రెజెంట్ చూస్తే తెలుగులో ఎక్కువ నష్టాలే వచ్చేలా ఉన్నాయని చెప్పాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X