18 కిమీ అజిత్ కారుని వెంబడిస్తూ.. నడిరోడ్డులో ఆపి, ఏం జరిగిందంటే!
స్టార్ హీరోలని దైవంలా భావించి ఆరాధించే అభిమానుల ఉంటారు. కొన్ని సందర్భాల్లో అభిమానులు హద్దులు మీరి ప్రవర్తించడం స్టార్ హీరోలకే చిక్కులు తెచ్చిపెడుతూ ఉంటుంది. సూపర్ స్టార్ రజని, కమల్, విజయ్, అజిత్.. తెలుగులో పవన్ కళ్యాణ్, మహేష్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలకు వెర్రెత్తిపోయే అభిమానులు ఉన్నాయి. పలు సందర్భాల్లో సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ జరుగుతుండడం చూస్తేనే ఉన్నాము. ఇదిలా ఉండగా తమిళనాట అజిత్ సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్నాడు. అజిత్ ఇటీవల ఓ అభిమాని నుంచి ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది.

18 కిమీ వెంటపడ్డాడు
అజిత్ ఇటీవల విమానాశ్రయం నుంచి కారులో బయలుదేరడం గమనించిన ఓ అభిమాని దాదాపు 18 కిమీ వెంబడించాడు. తన కారు వెనకే ఓ కుర్రాడు చాలాదూరం నుంచి వస్తుండడం గమనించిన అజిత్ మార్గం మధ్యలో కారు ఆపేశాడు. ఆ తరువాత ఆ కుర్రాడు చెప్పిన సమాధానం విని అజిత్ ఆశ్చర్యపోయాడు.

దయచేసి ఇలా చేయవద్దు
అజిత్ ఆ కుర్రాడిని ఎందుకు వెంబడిస్తునావు అని ప్రశ్నించగా.. నా పేరు గణేష్. మీకు వీరాభిమానిని. గతంలో మూడుసార్లు మిమ్మల్ని చూశాను కానీ ఫోటో దిగే అవకాశం రాలేదు. ఎయిర్ పోర్ట్ నుంచి మీరు రావడం గమనించి ఇలా వచ్చానని గణేష్ తెలిపాడు. గణేష్ చెప్పిన సమాధానంతో అజిత్ ఆశ్చర్యపోయాడు. ఇంకొకసారి ఇలా ప్రవర్తించవద్దని తన అభిమానికి సలహా ఇచ్చాడు. గణేష్ కోరిక ప్రకారం అతడితో ఫోటో దిగాడు.

నా గుండె పగిలిపోతుంది
గతంలో అజిత్ ని చూసినప్పుడు జనం ఎక్కువగా ఉన్నారు అందుకే ఫోటో దిగే అవకాశం రాలేదు. ఈ సారి ఆ అవకాశం మిస్ చేసుకోకూడదని భావించే ఇలా చేశానని గణేష్ తెలిపాడు. తాను ఇంత చేసినా అజిత్ తనపై ఆగ్రహం వ్యక్తం చేయలేదని, ప్రశాంతంగానే మాట్లాడాడని గణేష్ తెలిపాడు. నీవు చేసిన ఈ పని ప్రమాదానికి కారణం కావచ్చు. మీకు ఏమైనా అయితే నా గుండె పగిలిపోతుంది అంటూ అజిత్ తన అభిమానులపై ఉన్న ప్రేమని చాటుకున్నారట. వెంటనే తాను క్షమించమని అడిగినట్లు గణేష్ తెలిపాడు.

విశ్వాసం కంప్లీట్
అజిత్ ప్రస్తుతం శివ దర్శత్వంలో విశ్వాసం చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే పూర్తయింది. విశ్వాసం సెట్స్ లో ఓ డాన్సర్ మృతి చెందిన ఘటనలో అజిత్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశాడు. ఇటీవల పూణేలో షూటింగ్ జరుగుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. విశ్వాసం చిత్రం సంక్రాంతికి విడుదల కాబోతోంది.


Click it and Unblock the Notifications











