దీర్ఘకాల జ్వరంతో బాధపడుతున్న హీరోయిన్
'నా జీవితంలో దీర్ఘకాలం ఉన్న జ్వరం ఇదే. ఇంతగా ఎప్పుడూ ఇబ్బంది పడలేదు. ఎంత తొందరగా తగ్గితే అంత వేగంగా మళ్లీ పనిలో చేరిపోవాలనుంది. ప్రస్తుతానికి భయపడాల్సిందేం లేదు. మలేరియానో, స్వైన్ ఫ్లూనో అని కంగారు పడనక్కర్లేదు. ఇదో పాతరకం జ్వరం..అంతే!" అని ట్విట్టర్‌లో శృతిహాసన్ తన అభిమానులను ఉద్దేశించి రాసుకొచ్చింది. తీవ్రస్థాయిలో వస్తున్న ఫ్లూ వల్ల శృతి పూర్తిగా షూటింగులకు దూరమై ఆమె బెడ్‌రెస్ట్ తీసుకుంటోంది. ప్రస్తుతం శృతిహాసన్ ..సూర్యతో మురగదాస్ దర్శకత్వంలో '7ఎఎం అరివు" అనే చిత్రం నటిస్తోంది. ఈ చిత్రంలో శృతి సాధారణ కాలేజీ అమ్మాయిలా కనిపించబోతోంది. ఆ సినిమా సహా బాలీవుడ్ చిత్రం 'దిల్ తో బచ్చా హై జీ", సిద్దార్ధ సరసన కోవలమూడి సూర్య ప్రకాశరావు రూపొందించే సోషియో పాంఠసీలో నటిస్తోంది.
More from Filmibeat
శృతి హాసన్ సూర్య గజనీ మురగదాస్ సిద్దార్ధ ట్విట్టర్ shruti hassan surya ghajini murugadoss feaver siddrdha twitter


Click it and Unblock the Notifications











