హన్సికకు ఇదే మొదటి సారి...
బాలనటిగా కెరీర్ ను మొదలు పెట్టి ఆతర్వాత నాయికగా చిన్న వయసులోనే అవకాశాలను పొందిన పాలబుగ్గల సుందరి హన్సిక చిన్న వయసులో నాయికగా అడుగుపెట్టినా ఈ ముద్దుగుమ్మకు సంబంధించి ఓ విచిత్రమైన సంఘటన జరుగుతోంది. విషయంలోకి వెలితే...ఈ ముద్దు గుమ్మ తన కెరీర్ లో ఇది వరకెన్నడూ లేని విధంగా రెండో నాయికగా ఓ సినిమాలో తొలిసారి నటిస్తోంది.
ఇద్దరు నాయికలు ఉన్న సినిమాలలో మెయిన్ నాయికగా ఉండాలనుకునే మనస్తత్వంతో ఉండే హన్సిక(మస్కా, కంత్రి చిత్రాల విషయాలలో ఇది గమనించవచ్చు)తొలి తమిళ చిత్రం విడుదల కాకుండానే తాను నటిస్తున్న మూడో తమిళ చిత్రం 'వేలాయుథం"లో రెండో నాయికగా నటిస్తోంది. తెలుగు హిట్ చిత్రం 'ఆజాద్"కు రీమేక్ గా రూపొందుతున్న ఈ చిత్రం లో విజయ్ హీరో కాగా జెనీలియా జర్నలిస్ట్ గా సౌందర్య పాత్రలో నటిస్తోంది. హన్సిక సాగరకన్య శిల్పాశెట్టి చేసిన మహాలక్ష్మీ పాత్రను చేస్తోంది. రెండో నాయిక పాత్రకు ఆమడ దూరంలో ఉండేఈ పాత్రను ఒప్పుకోవడంలో ఆంతర్యం బహుశా హారో పాత్ర తననే పెళ్ళాడుతుంది కాబట్టి తనే మెయిన్ హీరోయిన్ అనుకోవడం వల్లనేమో మీరేమంటా.


Click it and Unblock the Notifications











