సీక్రెట్‌గా స్టార్ హీరోతో డేటింగ్.. అలా పట్టుబడిన స్టార్ హీరోయిన్!
సినీ ప్రముఖుల్లో కొందరి సంబంధ బాంధవ్యాలు ఒకింత వింతగా ఉంటే మరికొందరివి ఆదర్శంగా ఉంటాయని చెప్పాలి. అలాగే చేసుకున్నప్పటికీ మరొక హీరోయిన్స్ లేదా హీరోలు ఒకరితో సీక్రెట్ గా కూడా మైంటైన్ చేస్తూనే ఉంటారు. ఐతే ఇలాంటి పర్శనల్ విషయాలు బయట పెద్దగా కనిపించవు కానీ వీటికి అద్దం పట్టేలా మాత్రం పలు ఓటిటి వెబ్ సిరీస్ లలో చూపించేస్తారు.
కాగా ఇప్పుడు అయితే ఈ డేటింగ్ ట్రెండ్ మరింత ఎక్కువ అయ్యింది. నచ్చినంత కాలం డేటింగ్ లో ఉండి తర్వాత బ్రేకప్ లు చెప్పుకుంటున్నారు కొందరు యువ నటీనటులు కానీ.. కొందరు సీనియర్ స్టార్ లు మాత్రం కొంచెం భిన్నమే అని చెప్పాలి. తమ రిలేషన్ షిప్ లని ఇంకా కంటిన్యు చేస్తూ రహస్యంగానే మైంటైన్ చేస్తుంటారు.

అయితే మన తెలుగులో నరేష్, పవిత్ర లోకేష్ లు ఆ మధ్య ఎంత సంచలనం రేపారో తెలిసిందే. అప్పటకే పెళ్లిళ్లు అయినప్పటికీ వారు ప్రేమలో పడ్డారు. మరి ఈ తరహా సంబంధాలు ఒక్క టాలీవుడ్ లోనే కాదు కోలీవుడ్ స్టార్స్ లో కూడా లేకపోలేవు. ఉలగనయగన్ కమల్ హాసన్ పై కూడా పలు రూమర్స్ ఉన్నాయి. కాగా ఇప్పుడు మరో ఇద్దరు బిగ్ స్టార్స్ పేర్లు వైరల్ గా వినిపిస్తున్నాయి.
వారే దళపతి విజయ్ జోసెఫ్ ఇంకా స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ లు అట. మొన్న విజయ్ బర్త్ డే అయితే అందరు సినీ ప్రముఖులూ మొన్నే బర్త్ డే విషెష్ చెబితే ఒక్క త్రిష మాత్రం స్పెషల్ గా ఆ మరుసటి రోజు అంటే నిన్న ఓ స్పెషల్ పిక్ విజయ్ తో షేర్ చేసి చెప్పింది. దీనితో ఇక్కడ నుంచి అసలు రచ్చ మొదలయ్యింది.

త్రిష, విజయ్ లు సీక్రెట్ గా తమ రిలేషన్ షిప్ మైంటైన్ చేస్తున్నారు అని రూమర్ తెగ వైరల్ అయింది. విజయ్ కి తెలియకుండా త్రిష పిక్స్ తీయడం మరికొన్ని ప్రదేశాలకి ఇద్దరూ కలిసి వెళ్లారు అంటూ పలు మాటలు కోలీవుడ్ జనమే సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. కానీ దీనిని మాత్రం విజయ్ అభిమానులు ఖండిస్తున్నారు. విజయ్ ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలీ మ్యాన్ అని ఇలాంటివి అతడు ప్రోత్సహించడు అని అంటున్నారు.
అయితే కొందరు మాత్రం వారు రిలేషన్ షిప్ లో లేరు అనడానికి లేదనే అంటున్నారు. కాగా విజయ్ఎం త్రిష లు రెండు సార్లు సినిమాలు చేశారు. మొదటిగా మహేష్ బాబు నటించిన సెన్సేషనల్ 'ఒక్కడు' సినిమాని "గిల్లి" గా రీమేక్ చేసారు. ఇది అప్పుడూ హిట్ అయ్యింది. ఇప్పుడు రీ రిలీజ్ చేసినపుడు కూడా భారీ వసూళ్లు సాధించింది. కాగా దీనితో పాటుగా వీరిద్దరు రీసెంట్ గా దర్శకుడు లోకేష్ కనగరాజు కాంబినేషన్ లో చేసిన "లియో" తో మళ్ళీ జోడి కట్టారు. ఇది కూడా పెద్ద హిట్ అయ్యింది.


Click it and Unblock the Notifications











