Don't Miss!
- Finance Stock Market: ప్లాట్ గా స్టాక్ మార్కెట్లు.. టెక్ మహీంద్రాలో భారీ కుదుపు..!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్‌కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- News వివేకా కేసులో మరో అనూహ్య ట్విస్ట్- విచారణ నుంచి తప్పుకున్న జడ్జి..!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రమ్యకృష్ణ లుంగి డాన్స్, క్రేజీ టీజర్‌కి ఫిదా అయిపోతున్నారు: తానా సేరింద కూట్టం టీజర్
Recommended Video
సూర్య కథానాయకుడిగా తమిళంలో 'తానా సెరిందా కూట్టమ్' చిత్రం రూపొందుతోంది. విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను, దాదాపు 80 కోట్ల బడ్జెట్ తో జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నాడు. కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా విడుదలకు సిద్దమయ్యింది...
తానా సెరిందా కూట్టమ్ టీజర్
సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఆద్యంతం ఆసక్తికరంగా ఉన్న ఈ టీజర్లో సూర్య, కీర్తి సురేష్ నటనతో పాటు రమ్యకృష్ణ నటన హైలెట్ కానుందనే విషయం టీజర్ చూస్తుంటే తెలుస్తుంది. హీరో సూర్య ఇప్పటి వరకు చేయని పాత్రలో ఈ సినిమాలో కనిపిస్తున్నాడు.
కీర్తి సురేష్ కథానాయిక
కీర్తి సురేష్ కథానాయికగా నటించిన ఈ సినిమాను జ్ఞానవేల్ రాజా నిర్మించాడు. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమాను డిసెంబర్లో విడుదల చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ నిర్ణయం మార్చుకున్నారని సమాచారం. ఈ రెండు భాషల్లోను ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్నారట.
సూర్యకి మంచి క్రేజ్ వుంది
తెలుగు ఆడియన్స్ లోను సూర్యకి మంచి క్రేజ్ వుంది. అయితే కొంత కాలంగా ఇక్కడి నుంచి ఆయనకి సరైన హిట్ వెళ్లలేదు. ఈ నేపథ్యంలో సినిమాపై మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉండాగా టాలీవుడ్ స్టార్స్ కి పోటీగా వస్తన్న ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి..
రమ్యకృష్ణ లుంగీ
మరీ ముఖ్యంగా ఈ టీజర్ చూసిన వారంతా రమ్యకృష్ణ లుంగీ కట్టుకుని డ్యాన్స్ చేసిన సీన్ గురించే మాట్లాడుకుంటుండటం విశేషం. బాహుబలి సినిమాలో శివగామిగా రాజమాత పాత్రలో హుందాగా కనిపించిన రమ్యకృష్ణ ఇలా లుంగీ కట్టి హీరో సూర్యతో డ్యాన్స్ చేయడం గురించే అంతా మాట్లాడుకుంటున్నారు.