సునీల్ హీరోయిన్ కమల్ సరసన..హ్యాపీస్

By Srikanya

Andrea
చెన్నై : రీసెంట్ గా సునీల్ సరసన 'తడాఖా' చిత్రంలో కనిపించిన ఆండ్రియా గుర్తుందా. ఆమె ఇప్పుడు కమల్ సరసన విశ్వరూపం 2 లో చేస్తోంది. గాయనిగా వెండితెరకొచ్చి హీరోయిన్ గా హవా చాటుకుంటోంది ఆండ్రియా. 'విశ్వరూపం'లో నటించి దక్షిణాదిలో పేరు సంపాదించుకుంది.

ఆండ్రియా మాట్లాడుతూ...కమల్‌తో నటిస్తానని అస్సలు వూహించలేదు. అందులోనూ 'విశ్వరూపం' వంటి చిత్రంలో నటించటం నిజంగానే అదృష్టం. టాలీవుడ్‌లో దక్కిన హాలీవుడ్‌ అవకాశం అది. భవిష్యత్తులో ఇలాంటి అవకాశం వస్తుందనే నమ్మకం లేదు. కమల్‌కు జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పింది.

ప్రస్తుతం 'విశ్వరూపం-2'ను శరవేగంగా చిత్రీకరిస్తున్నాడు కమల్‌. తొలిభాగంలో పూజాకుమార్‌కు ప్రాధాన్యం ఇచ్చిన కమల్‌ రెండోభాగంలో ఆండ్రియాను హైలెట్‌ చేసినట్టు తెలుస్తోంది. రెండోభాగం కథ భారత్‌లో జరుగుతుందనే విషయాన్ని తొలిభాగం శుభంకార్డుతోపాటు చెప్పాడు.

అయితే ఇక్కడ ఆశించినస్థాయిలో లొకేషన్లు లభించకపోవడంతో థాయ్‌లాండ్‌కు వెళ్లిపోయాడు. సినిమాను ఆగస్టులో విడుదల చేయనున్నట్లు ఇదివరకే ప్రకటించారు కమల్‌.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X