twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టైటిల్ లో సత్తా ఉంది... అంచనాలు రీచ్ అవుతారా..?

    By Srikanya
    |

    చెన్నై : ప్రస్తుతం తమిళంలో ఉన్న టాప్‌ హీరోల్లో శివకార్తికేయన్‌కు ప్రత్యేకస్థానముంది. శివ నటించిన 'ఎదిర్‌నీచ్చల్‌', 'వరుత్తపడాద వాలిబర్‌ సంఘం', 'మాన్‌కరాటే' వంటి పలు చిత్రాలు కమర్షియల్‌గా విజయం సాధించి శివకార్తికేయన్‌ ప్రత్యేకతను చాటాయి. ఈ వరుసలో వస్తున్న కొత్త చిత్రం 'కాక్కిసట్టె'.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    దురై సెంథిల్‌కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన 'ఎదిర్‌నీచ్చల్‌' మంచి విజయాన్ని సాధించింది. తన కెరీర్‌లో పోలీసు అధికారిగా తొలిసారిగా నటిస్తున్నారు. ఈ చిత్రం శుక్రవారం తెరపైకి రానుంది. శ్రీదివ్య హీరోయిన్ గా నటించారు. అనిరుధ్‌ రవిచంద్రన్‌ సంగీతం సమకూర్చారు.

    తమిళనాడులో ఏకంగా 400 థియేటర్లలో సినిమా విడుదల కానున్నట్లు సమాచారం. ఇక ఇతర ప్రాంతాల్లో 300 థియేటర్ల వరకు విడుదలవుతున్నట్లు చిత్రవర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాకు ఓపెనింగ్స్‌ కూడా భారీ స్థాయిలో ఉంటుందని కోలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి.

    Thriller mode with new film Kakki Sattai

    చిత్రం విషయం ఇలా ఉంటే....

    నటుడు ధనుష్‌తో తనకు ఎలాంటి విభేదాలు లేవని తమిళ హీరో శివకార్తికేయన్‌ తెలిపారు. శివకార్తికేయన్‌ చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యాక.. ఆయనకు పెద్ద చేయి అందించి.. పెద్ద చిత్రాల్లో నటింపజేసిన ఘనత ధనుష్‌దే. 'ఎదిర్‌నీచ్చల్‌' వంటి చిత్రాన్ని నిర్మించి శివకార్తికేయన్‌కు హిట్‌కు ఇచ్చారు. తాను నటించిన '3' సినిమాలో కూడా కీలకమైన పాత్రలో అవకాశం ఇచ్చారు.

    అంతేకాకుండా తాజాగా 'కాక్కిసట్టె' చిత్రాన్ని కూడా నిర్మిస్తున్నారు. అయితే ఇటీవల వీరిద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంటోందని మీడియాలో ప్రచారం సాగుతోంది. దాంతో సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో ఈ విషయమై పెద్ద చర్చ నడుస్తోంది. హీరో ఫ్యాన్స్ మధ్య తిట్లు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపధ్యంలో తనకు ఎలాంటి విభేధాలు లేవని వివరణ ఇచ్చారు.

    శివకార్తికేయన్‌ మాట్లాడుతూ.. వాస్తవానికి మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు. మా స్నేహం అలాగే కొనసాగుతోంది. 'కాక్కిసట్టె' సినిమా కార్యక్రమానికి ధనుష్‌ హాజరుకాక పోవడంతో ఇలాంటి వదంతులు వ్యాపిస్తున్నాయి. ఆయన మమ్మల్ని పూర్తిగా నమ్మారు. బడ్జెట్‌ కూడా ప్రారంభంలో నిర్ణయించకుండా.. అంతా మా చేతుల్లోనే పెట్టేశారు. పోలీసు పాత్రలో నటించగలననే ఆత్మవిశ్వాసాన్ని నాలో నింపింది ధనుషే. 'కాక్కిసట్టె' నేను నటిస్తున్న ఏడో చిత్రం. తక్కువ కాలంలో ఇంత స్టార్‌డమ్‌ను అందించిన ప్రేక్షకులకు ఎప్పుడూ రుణపడి ఉంటామని అన్నారు.

    English summary
    This is the second time director RS Durai Senthil Kumar, Anirudh, Sivakarthikeyan and Dhanush are coming together for a film, after the hit Ethir Neechal last year. Sivakarthikeyan will be seen as a cop for the first time. Kakki Sattai film will also mark the return of the hit pair of Varuthapadatha Valibar Sangam- Sivakarthikeyan and Sri Divya.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X