లిప్‌లాక్‌తో సిగ్గుపడాల్సిన అవసరం ఉందా? సుచీలీక్స్‌పై ఆండ్రియా షాకింగ్ కామెంట్

వివాదాస్పద సుచీ లీక్స్ సంచలనం దక్షిణాదిలో ఎలాంటి ప్రకంపనలు సృష్టించిందో అందరికీ తెలిసిందే. దక్షిణాదికి చెందిన టాప్ హీరో, హీరోయిన్లు, సింగర్స్, మ్యూజిషియన్స్ మధ్య సన్నిహిత సంబంధాలు, లిప్‌లాక్ చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ వివాదంలో రానా, త్రిష, ఆండ్రియా, అనిరుధ్, ధనుష్ చిత్రాలు విస్తృతంగా ప్రచారం అయ్యాయి. అప్పట్లో ఆ ఘటనపై ఆండ్రియా చేసిన సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. మీడియాలో మరోసారి వైరల్‌గా మారిన ఆండ్రియా కామెంట్స్ ఏమిటంటే..

సింగర్ సుచిత్ర వివాదానికి

సింగర్ సుచిత్ర వివాదానికి

సుచీ లీక్స్ వివాదానికి కేంద్ర బిందువుగా సింగర్ సుచిత్ర మారారు. ఆమె అఫీషియల్ అకౌంట్ నుంచి పలువురి రొమాంటిక్ ఫొటోలు సోషల్ మీడియాలోకి వెళ్లాయి. దాంతో పలువురు హీరో, హీరోయిన్ల తెర వెనుక బాగోతాలు బట్టబయలు అయ్యాయి. ఈ వివాదం తీవ్రతరం కావడంతో తన అధికార ట్విట్టర్ అకౌంట్‌ను ఎవరో హ్యాక్ చేశారని సుచిత్ర పేర్కొనడం మరో వివాదానికి దారి తీసింది.

ఆ ఫోటోలు పాతవి..

ఆ ఫోటోలు పాతవి..

సుచీలీక్స్ వివాదంపై హీరోయిన్ ఆండ్రియా జెర్మియా స్పందిస్తూ.. అనిరుధ్, తన ఫోటోలు వాస్తవమే. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ అవి చాలా కాలం క్రితం తీసిన ఫోటోలు. మా మధ్య అలాంటి రిలేషన్ ఉంది. దానిని దాచడానికి భయం లేదు. కానీ కొన్ని వ్యక్తిగతంగా ఉండాల్సినవి బహిరంగం కావడమే బాధగా ఉంది అని అన్నారు.

అనిరుధ్‌తో నా రిలేషన్

అనిరుధ్‌తో నా రిలేషన్

మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్‌తో తనకు మంచి బాండింగ్ ఉంది. మా మధ్య లవ్‌ అనేది సాధారణమైన విషయం. లిప్‌లాక్ విషయం గురించి, మాట్లాడుకోవడానికి, దాని గురించి చెప్పుకోవడానికి సిగ్గుపడాల్సిన విషయం ఏమీ లేదు. ఫోటోలు లీక్ అయిన తర్వాత అనిరుధ్ నాకు సారీ చెప్పారు. తనకు ప్రమేయం లేకుండా ఫోటోలు సోషల్ మీడియాలో పబ్లిష్ అయ్యాయని వివరణ ఇచ్చాడు అని ఆండ్రియా చెప్పారు.

Recommended Video

Darbar Movie Review And Rating || దర్బార్ మూవీ రివ్యూ
బ్రేకప్ జరిగినా.. ఫ్రెండ్‌షిప్ అలానే

బ్రేకప్ జరిగినా.. ఫ్రెండ్‌షిప్ అలానే

సుచీలీక్స్ వ్యవహారం ముగిసిన తర్వాత ఆండ్రియా మాట్లాడుతూ.. ఆ తర్వాత అనిరుధ్‌కు తనకు బ్రేకప్ జరిగింది. అయితే తమ మధ్య రిలేషన్‌లో ఎలాంటి మార్పులేదు. మా ఫ్రెండ్‌షిప్ అలానే ఉంది. ఈ వివాదం తర్వాత రజనీ కుటుంబంతో ఎలాంటి మనస్పర్ధలు రాలేదు అని ఆండ్రియా వివరణ ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X