»   »  అసిస్టెంట్ డైరెక్టర్ మీద చేయిచేసుకున్న ‘తుపాకి’ నటి!

అసిస్టెంట్ డైరెక్టర్ మీద చేయిచేసుకున్న ‘తుపాకి’ నటి!

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో విజయ్ హీరోగా తెరకెక్కిన ‘తుపాకి' చిత్రంలో హీరోయిన్ కాజల్ స్నేహితురాలి పాత్రలో నటించిన మీనాక్షి వార్తల్లోకి ఎక్కింది. ఓ తమిళ సినిమా షూటింగులో ఆమె అసిస్టెంట్ డైరెక్టర్ మీద కారణం లేకుండా చేయిచేసుకోవడమే ఇందుకు కారణం. ఆమె చర్య వివాదానికి దారి తీయడంతో క్షమాపణలు చెప్పింది.

మీనాక్షి నటిస్తున్న ‘నేర్‌ముగమ్‌' చిత్రీకరణ చెన్నైలోని పాత మహాబలిపురం రోడ్డులోని ఫిలిం సిటీ ప్రాంగణంలో జరుగుతోంది. శనివారం షూటింగ్‌ జరుగుతున్న సమయంలో చిత్ర సహాయ దర్శకుడిపై మీనాక్షి చేయి చేసుకుంది. కారణం లేకుండా ఆమె ఈచర్యకు పాల్పడటంతో అంతా షాకయ్యారు.

Thuppakki Actress Meenakshi Slaps Assistant Director For No Reason!

సదరు సహాయ దర్శకుడికి మద్దతుగా యూనిట్ సభ్యులు, ఇతర టెక్నీషియన్లు మీనాక్షి ఆందోళనకు దిగారు. సహాయ దర్శకుడికి క్షమాపణలు చెప్పాలని, అప్పటి వరకు ఆమెను షూటింగ్‌ స్పాట్‌ నుండి కదలనివ్వమని నిర్భంధించారు. దీంతో మీనాక్షి సదరు బాధితుడికి క్షమాపణలు చెబుతూ, లేఖ రాసింది.

ఇకపై ఇలాంటి చర్యలకు పాల్పడనని, బుద్దగా ఉంటానని మీనాక్షి వేడుకోడంతో పరిస్థితి సద్దుమనిగింది. అయితే మీనాక్షి ఎందుకు ఇలా ప్రవర్తించింది? అనేది ఎవరికీ అంతు పట్టడం లేదు. ఇద్దరి మధ్య బయటకు చెప్పడానికి వీలే లేని గొడవ ఏదైనా జరిగిందా? అనే విషయమై ఆరా తీస్తున్నారు.

English summary
Meenakshi, who made a special appearance in Ilayathalapathy Vijay's Thuppakki has slapped an assistant director in the sets of her upcoming movie, Ner Mugam. The Naanum Rowdydhaan actress made her Tamil debut in Karuppusamy Kuththagaithaarar.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu