twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'ఐదు సన్నివేశాలు తొలగించాం'..నిర్మాత వెల్లడి

    By Srikanya
    |

    చెన్నై : తుపాకి చిత్రంలో అభ్యంతరకరంగా ఉన్న ఐదు సన్నివేశాలను తొలగించినట్లు చిత్ర నిర్మాత థాను ప్రకటించారు. విజయ్‌ హీరోగా ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన తుప్పాక్కి దీపావళి రోజున విడుదలైంది. తమ మనోభావాలన కించపరిచే పలు సన్నివేశాలు తుపాకిలో ఉన్నట్లు ముస్లిం సంఘాలు ఆరోపించాయి. విజయ్‌ నివాసాన్ని ముట్టడించేందుకు వీరు చేసిన ప్రయత్నాన్ని కూడా పోలీసులు అడ్డుకున్నారు.

    ఆపై విజయ్‌, కలైపులి థాను నివాసాలతో పాటు, విజయ్‌ అభ్యర్థన మేరకు తుప్పాక్కి ప్రదర్శితమవుతున్న థియేటర్ల వద్ద కూడా పోలీసు భద్రత కల్పించారు. ఇదిలా ఉంటే థాను, విజయ్‌ తండ్రి, సినీ దర్శకుడు ఎస్‌ఏ చంద్రశేఖర్‌లు నగర పోలీసు కమిషనర్‌ జార్జ్‌ని కలిశారు. బయటకొచ్చిన అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. తుప్పాక్కిలో అభ్యంతరకర సన్నివేశాలు ఐదు ఉన్నట్లు ముస్లిం సంఘాలు తెలిపాయని, వీటిపై వివరణ ఇచ్చేందుకు కమిషనర్‌ను కలిసినట్లు తెలిపారు. అంతే కాకుండా సంబంధిత సన్నివేశాలను తొలగించటంతో పాటు, తొలగించిన సన్నివేశాలతో కూడిన సినిమా సీడీలను ముస్లిం సంఘాలకు అప్పగించినట్లు పేర్కొన్నారు.

    చిత్రంలోని సన్నివేశాలపై ముస్లిం సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ముంబయిలో కలకలం సృష్టించే తీవ్రవాదులను సైనిక దళం హతమార్చే ఇతివృత్తంతో తుపాకీ రూపొందింది. దీని గురించి హిందూ దేశీయ ముస్లిం లీగ్ అధ్యక్షుడు జవహర్ ఒక ప్రకటన విడుదల చేశారు. ముంబ యి బాంబ్ బ్లాస్ట్ సంఘటనల ఇతివృత్తంతో తుపాకీ చిత్రం రూపొందిందని తెలిపారు. ఆ సంఘటన వెనుక కొన్ని సంఘాల హస్తం ఉన్నా, వాటికి ముస్లింలకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. కొందరు చేసే తప్పులను మతం మొత్తానికి ఆపాదించడం సరికాదని వెల్లడించారు.

    జవహర్ అలీ మీడియాతో మాట్లాడుతూ... తక్షణం తుపాకీ సినిమాలో ముస్లింల మనోభావాలు దెబ్బతినేలా వున్న డైలాగుల్ని తొలగించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ముస్లిం వర్గానికి చెందిన అన్ని పార్టీలు, సంస్థల్ని కలుపుకొని ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ముస్లింలను తీవ్రవాదులుగా, సంఘవిద్రోహశక్తులకు చిత్రీకరించడం ఎంతవరకు సబబని, మంచీచెడు అన్ని మతాల్లో, అన్ని వర్గాల్లో వుందని పేర్కొన్నారు. ఇదిలా వుండగా తుపాకీ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్ల వద్ద కూడా పోలీసులు భారీ భద్రతను కల్పించారు. అలాగే ముస్లింల పేరు గల వారిని తీవ్రవాదులుగా చిత్రీకరించడం దారుణమని పేర్కొన్నారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

    English summary
    Tupaki film producer...Kalaipuli Thanu has said “We did not want to hurt anyone’s sentiment. We regret if it had hurt the Muslim community and we are removing the objectionable scenes at the earliest.Vijay’s father and Tamil Film Producers Council president SA Chandrasekhar said “Vijay would never act in a film which would offend anyone’s feelings. I promise Vijay would act as a Muslim character in one of his future films.
 
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X