విశాల్ మూవీ అప్‌డేట్.. ఫస్ట్ లుక్ ఎప్పుడంటే..?
విశాల్-మిస్కిన్ కాంబినేషన్‌లో వచ్చిన తుప్పరివాలన్ (డిటెక్టివ్) చిత్రం గురించి అందరికీ తెలిసిందే. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కించిన ఈ చిత్రం విశాల్‌ను మళ్లీ లైమ్ లైట్‌లోకి తీసుకొచ్చింది. ఆ చిత్రం మళ్లీ వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ పడ్డాయి. అయితే ఆ సమయంలోనే డిటెక్టివ్ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని ప్రకటించిన సంగతి తెలిసిందే.
తమిళ నాట సస్పెన్స్ థ్రిల్లర్స్‌ను తెరకెక్కించడంలో తనకంటూ ఓ ప్రత్యేకతను సృష్టించుకున్న దర్శకుడు మిస్కిన్. తాజాగా సైకో అంటూ ప్రేక్షకులను భయపెట్టాడు. అయితే తుప్పరివాలన్ 2 చిత్రానికి కూడా మిస్కినే దర్శకుడిగా వ్యవహరించాడు. అయితే చివర్లో హీరోకు, దర్శకుడుకు విబేధాలు తలెత్తడంతో వివాదంగా మారింది.

బడ్జెట్ పరిమితులు దాటుతోందని, ఇష్టమొచ్చినట్టుగా ఖర్చు పెట్టిస్తున్నారని దర్శకుడిపై ఫైర్ అయినట్టు తెలుస్తోంది. దీంతో హర్ట్ అయిన డైరెక్టర్ ప్రాజెక్ట్‌ను మధ్యలోనే వదిలేశాడు. హీరో విశాల్.. దర్శకత్వ బాధ్యతలు చేపట్టి చిత్రాన్ని పూర్తి చేసేశాడు. ఇక ఈ మూవీ నుంచి మరో అప్‌డేట్ వచ్చేసింది. ఈ సినిమా ఫస్ట్ లుక్ రేపు రాబోతోందని ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో విశాల్, ఇళయరాజా పేర్లు మాత్రమే కనిపిస్తున్నాయి. అయితే దర్శకుడిగా విశాల్ పేరునే టైటిల్ కార్డులో వేసుకునేలా ఉన్నాడు.


Click it and Unblock the Notifications











