ఈ సారి లండన్‌లో వేట.. ఆసక్తికరంగా విశాల్ ఫస్ట్ లుక్
విశాల్-మిస్కిన్ కాంబినేషన్‌లో వచ్చిన తుప్పరివాలన్ (డిటెక్టివ్) చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. అప్పటి వరకు హిట్ లేక సతమతమవుతున్న విశాల్‌కు ఒక్కసారిగా ఊపిరినిచ్చింది డిటెక్టివ్. బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన తుప్పరివాలన్ చిత్రానికి సీక్వెల్ రాబోతోందని అప్పట్లో ప్రకటించారు. అయితే ఈ మూవీకి సంబంధించిన వివాదం గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
దర్శకుడు మిస్కిన్‌ను చిత్రం నుంచి తప్పించడం, విశాల్ దర్శకత్వ బాధ్యతలను తీసుకోవడం అందరికీ తెలిసిందే. తనను తప్పించడంపై మిస్కిన్ సెటైర్లు కూడా వేశాడు. అయితే కాసేపటి క్రితమే ఈ విషయంపై విశాల్ క్లారిటీ ఇస్తూ.. సుదీర్ఘమైన పోస్ట్ చేశాడు. మిస్కిన్ వృథా ఖర్చు చేస్తున్నాడని, అడిగే బాధ్యత నిర్మాతకు ఉండదా? అంటూ ప్రశ్నించాడు. సినిమాను అలా మధ్యలోనే వదిలేశాడని, అందుకు తాను దర్శకత్వ బాధ్యతలు చేపట్టానని పేర్కొన్నాడు.

దర్శకుడిగా మొదటి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నాననీ, మీ అంచనాలకు తగ్గట్టే సినిమాను తెరకెక్కిస్తానని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని, అందరి ఆశీస్సులు కావాలంటూ పోస్ట్ చేశాడు. కాసేపటి క్రితమే తుప్పరివాలన్ 2 ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. అయితే పోస్టర్‌ను బట్టి చూస్తే.. ఈ సారి లండన్‌లో వేటను కొనసాగించేలా కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











