‘టిక్ టిక్ టిక్’ మేకింగ్ వీడియో: అంతరిక్ష పరిశోధన కేంద్రం సెట్ అదుర్స్
తమిళంలో జయం రవి, నివేదా పేతురాజ్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం 'టిక్ టిక్ టిక్'. స్పేస్ షిప్, అంతరిక్ష పరిశోధనా కేంద్రం, ఉల్కాపాతం కాన్సెప్టుతో తెరకెక్కిన తొలి సౌత్ మూవీ ఇది. ఇటీవల తమిళం, తెలుగులో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది.
ఈ సినిమా షూటింగ్ అంతా చెన్నై, మున్నార్ ప్రాంతాల్లో జరిగింది. స్పేస్ షిప్, అంతరిక్ష పరిశోధనా కేంద్రానికి సంబంధించిన సెట్స్ వేసి గ్రాఫిక్స్ జోడించి ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి కలిగించడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారు.
జయం రవి, నివేదా పేతురాజ్ హీరో హీరోయిన్లుగా శక్తి సౌందర్ రాజన్ దర్శకత్వంలొ ఈ సినిమా తెరకెక్కింది. తెలుగులో చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ బ్యానర్‌పై చదలవాడ పద్మావతి , చదలవాడ లక్ష్మణ్ విడుదల చేశారు.

తమిళనాడులో టిక్ టిక్ టిక్ మంచి వసూళ్లు సాధిస్తోంది. అయితే తెలుగులో ఆ స్థాయిలో వసూళ్లు లేవని చెప్పక తప్పదు. విడుదల సినిమా ప్రమోషన్స్ సరిగా నిర్వహించక పోవడంతో ఓపెనింగ్స్ చాలా తక్కువగా వచ్చాయి.


Click it and Unblock the Notifications











