twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అద్బుతమైన విజువల్ అనుభవం, సెన్సేషనల్ ట్రైలర్: ఫుల్‌లెంగ్త్ స్పేస్ మూవీ టిక్ టిక్ టిక్

    తమిళనాట నిన్నట్నుంచి ఒక సినిమా ట్రైలర్ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఆ సినిమా పేరు.. "టిక్ టిక్ టిక్". జయం రవి కథానాయకుడిగా నటించిన సినిమా ఇది. టీజర్ వచ్చిన దగ్గరినుంచీ కోలీవుడ్ పిచ్చెక్కి పోతోంది.

    |

    తమిళనాట నిన్నట్నుంచి ఒక సినిమా ట్రైలర్ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఆ సినిమా పేరు.. "టిక్ టిక్ టిక్". జయం రవి కథానాయకుడిగా నటించిన సినిమా ఇది. హాలీవుడ్ వచ్చే సైన్స్ ఫిక్షన్.. స్పేస్ సినిమాలు చూసి ఆస్వాదిస్తూ.. ఇలాంటి సినిమాలు మన దగ్గర రావా అంటూ నిట్టూర్చడం మామూలే. మన దర్శకులకు కూడా అలాంటి భారీ ఆలోచనలు ఉన్నప్పటికీ.. ఇలాంటివి మన దగ్గర సాధ్యమా అన్న సందేహాలతో మొగ్గ దశలోనే ఆ ఆలోచనల్ని తుంచేసేవాళ్లు. కానీ 'బాహుబలి' లాంటి సాహసోపేత ప్రయత్నాల్ని చూశాక మిగతా దర్శకులకూ ధైర్యం వస్తోంది.

     అంతర్జాతీయ ప్రమాణాలతో

    అంతర్జాతీయ ప్రమాణాలతో

    మన వాళ్లు కూడా అంతర్జాతీయ స్థాయిలో ఆలోచిస్తున్నారు. ఇప్పుడు తమిళంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఓ స్పేస్ మూవీ తెరకెక్కుతుండటం విశేషం. ఇండియాలో రాబోతున్న తొలి స్పేస్ మూవీగా దీన్ని ప్రచారం చేస్తున్నారు. ఇంతకీ ఈ సినిమా ప్రత్యేకత ఏంటి అంటే.. ఇండియాలో తెరకెక్కిన తొలి పూర్తి స్థాయి స్పేస్ మూవీ ఇదేనట.

    అంతరిక్షం నేపథ్యంలో

    అంతరిక్షం నేపథ్యంలో

    ఇంతకుముందు అంతరిక్షం నేపథ్యంలో కొన్ని సినిమాలు వచ్చాయి కానీ.. వాటిలో స్పేస్ గురించి ఊరికే అలా టచ్ చేశారు అంతే. పూర్తి స్థాయి స్పేస్ మూవీ అన్నది ఇండియాలో ఇప్పటిదాకా రాలేదు. హాలీవుడ్ నుంచి మాత్రమే ఇలాంటి సినిమాలు వస్తుంటాయి. వాటిని చూసి మన ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తుంటారు.

    ఫుల్ లెంగ్త్ స్పేస్ మూవీ

    ఫుల్ లెంగ్త్ స్పేస్ మూవీ

    ఐతే శక్తి సౌందర్ రాజన్ అనే దర్శకుడు తమిళంలో ఫుల్ లెంగ్త్ స్పేస్ మూవీ తీసేశాడు. ఈ సినిమా ట్రైలరే ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది."తనీ ఒరువన్"తో దేశవ్యాప్తంగా పాపులరైన జయం రవి నటిస్తున్న ఈ సినిమా పేరు.. ‘టిక్ టిక్ టిక్'. ఈ చిత్ర టీజర్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

     టీజర్ చూసి ఆశ్చర్యపోతున్నారు

    టీజర్ చూసి ఆశ్చర్యపోతున్నారు

    రీజనల్ స్థాయిలో ఇలాంటి సినిమానా అంటూ టీజర్ చూసి ఆశ్చర్యపోతున్నారు. ఏ దేశం కూడా 20 కిలోలకు మించి అణ్వాయుధాన్ని తయారు చేయకూడదని ఒప్పందం ఉందని.. ఐతే ప్రపంచంలో ఏ దేశం కూడా తాళలేని 200 కిలోల మిస్సైల్ మన దగ్గర ఉందని.. దేశానికి ఏదైనా ఆపద వస్తే మనం చూస్తూ ఊరుకోమని ఓ సైనికాధికారి చెప్పడంతో ఈ టీజర్ మొదలవుతుంది.

     ఆస్టరాయిడ్ భూమి మీద పడబోతోంది

    ఆస్టరాయిడ్ భూమి మీద పడబోతోంది

    "టిక్ టిక్ టిక్" కథాంశం విషయానికి వస్తే తమిళనాడు ప్రాంతంలోకి ఒక ఆస్టరాయిడ్ వచ్చి పడి ఒక ప్రాంతం ధ్వంసమవుతుంది. ఐతే కొన్ని వారాల తర్వాత ఇంకో పెద్ద ఆస్టరాయిడ్ భూమి మీద పడబోతోందని.. అది పడితే భారీ నష్టం వాటిల్లుతుందని సైంటిస్టులకు తెలుస్తుంది.

     రవి స్పేస్ సైంటిస్టు

    రవి స్పేస్ సైంటిస్టు

    ఆ ఆస్టరాయిడ్‌ను ఆపడానికి ఒక మిసైల్ ప్రయోగించాల్సి ఉంటుంది. ఆ మిస్సైల్ శత్రువుల చేతుల్లో ఉంటుంది. ఆ మిస్సైల్ ను నడిపించేవాడే హీరో. జయం రవి స్పేస్ సైంటిస్టుగానే కాక మెజీషియన్ గానూ కనిపిస్తున్నాడు. విజువల్ ఎఫెక్ట్స్ అవీ హై స్టాండర్డ్స్ లోనే ఉన్నట్లు టీజర్ చూస్తే తెలుస్తోంది.

    శక్తి సౌందర్ రాజన్

    ఇంతకుముందు జయం రవితో జాంబీ ఫిలిం "మిరుతన్" తీసిన శక్తి సౌందర్ రాజన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. నివేదా పేతురాజ్ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రం డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అతను మెజీషియన్ కమ్ ఎస్కేప్ ఆర్టిస్ట్. మరి ఈ హీరో ఆ టాస్క్ ఎలా పూర్తి చేశాడన్నది ఈ సినిమా కథ. ట్రైలర్ చూస్తే ఇందులో స్పేస్ తాలూకు స్పెషల్ ఎఫెక్టులు బాగానే చేసినట్లున్నారు.

    English summary
    Going by the visuals, Jayam Ravi and his team are sent to space to stop a 200 kiloton missile from reaching Earth. Tipped to be a race-against-time thriller, the film also stars Nivetha Pethuraj and Singaporean actor Aziz Aaron.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X